Jammi Chettu | వాస్తు దోష నివారిణి ‘జ‌మ్మిచెట్టు’.. ఇలా పూజిస్తే శ‌ని బాధ‌లు మ‌టుమాయం..!

Jammi Chettu | హిందూ సంప్ర‌దాయం( Hindu Custom )లో కొన్ని మొక్క‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. అలాంటి మొక్క‌ల‌ను( Plants ) పెంచుకుంటూ వాటికి నిత్యం పూజ‌లు చేస్తుంటారు. కొన్ని చెట్ల‌ను పూజించ‌డం కార‌ణంగా జాత‌క దోషాల వ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొందొచ్చ‌నేది న‌మ్మ‌కం.

Jammi Chettu | వాస్తు దోష నివారిణి ‘జ‌మ్మిచెట్టు’.. ఇలా పూజిస్తే శ‌ని బాధ‌లు మ‌టుమాయం..!

Jammi Chettu | హిందూ సంప్ర‌దాయం( Hindu Custom )లో కొన్ని మొక్క‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. అలాంటి మొక్క‌ల‌ను( Plants ) పెంచుకుంటూ వాటికి నిత్యం పూజ‌లు చేస్తుంటారు. కొన్ని చెట్ల‌ను పూజించ‌డం కార‌ణంగా జాత‌క దోషాల వ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొందొచ్చ‌నేది న‌మ్మ‌కం. ముఖ్యంగా ఏలినాటి శ‌ని బాధ‌ల‌ను పోగొట్టుకోవ‌డానికి, వాస్తు స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు ఏ చెట్ల‌ను పూజిస్తే మంచిదో తెలుసుకుందాం..

ఒక ఇంటిని వాస్తు నియ‌మాల‌కు అనుగుణంగా నిర్మించినా కూడా.. ఏదో ఒక చోట చిన్న‌చిన్న పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి. ఆ ఇంటి య‌జ‌మానులు కూడా తెలిసో తెలియ‌కో త‌ప్పులు చేస్తుంటారు. ఇలా పొర‌పాట్లు, త‌ప్పుల‌కు ప‌రిహారంగా ఇంట్లో జ‌మ్మి చెట్టును పెంచుకుంటే మంచిద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు శనీశ్వరుడికి సంబంధించినదిగా తెలుస్తోంది. శనీశ్వరుడి చెట్టుగా భావించే జమ్మి చెట్టును ఇంట్లో పెంచుకోవడం వలన మన ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని విశ్వాసం. కాబ‌ట్టి శుభ ఫలితాల కోసం ప్రతినిత్యం జమ్మి చెట్టుకు నీరు పోసి సంరక్షించాలి. క్రమం తప్పకుండా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, పసుపు కుంకుమలతో పూజించాలి. సాయం సంధ్యా సమయంలో జమ్మి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని వలన కలిగే దుష్ప్రభావాలు పోతాయని విశ్వాసం. రాహువు అనుగ్రహం కోసం శనివారం, సోమవారం జమ్మిచెట్టుకు కొమ్మను పసుపుకుంకుమలతో పూజించి, ఎర్ర కలువ పూలతో శమీ చెట్టు మంత్రాలను జపిస్తూ పూజిస్తే జాతకంలో బలహీనమైన రాహు స్థానం బలపడుతుందని విశ్వాసం. జాతక దోషాల వలన కలిగే దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.

వాస్తు శాస్త్రం సూచించిన ప్రకారం జమ్మి చెట్టును ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నాటితే శుభకరమని తెలుస్తోంది. ఒకవేళ ప్రధాన ద్వారం వద్ద జమ్మిచెట్టుని నాటడానికి సరిపడా స్థలం లేకపోతే మేడమీద దక్షిణం వైపు జమ్మి చెట్టును నాటడం సకల శుభాలను ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.