Karthika Amavasya | నవంబర్ 20న కార్తీక అమావాస్య.. ఈ నాలుగు రాశులపై తీవ్ర చెడు ప్రభావం..!
Karthika Amavasya | కార్తీక అమావాస్య( Karthika Amavasya )నవంబర్ 20న రానుంది. అయితే ఈ అమావాస్య రోజున చంద్రుడు( Moon ) చాలా బలహీనంగా ఉండటం వలన కొన్ని రాశుల( Zodiac Signs )పై ఇది ప్రతి కూల ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఏ రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.
Karthika Amavasya | ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అమావాస్య( Amavasya ), పౌర్ణమి( Purnima ) రావడం సహజం. ఇక అమావాస్య వచ్చినా.. ఆ పక్షంలో రోజులను అశుభంగా భావిస్తారు. కొత్త పనులు కూడా ప్రారంభించరు. ఈ అమావాస్య కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్నిసార్లు చెడు ఫలితాలను ఇస్తుంది. అయితే త్వరలో రాబోయే కార్తీక అమావాస్య( Karthika Amavasya )(నవంబర్ 20) ఈ నాలుగు రాశులపై తీవ్ర చెడు ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ నాలుగు రాశులేవో తెలుసుకుందాం..
మిథున రాశి( Gemini )
కార్తీక అమావాస్య సమయంలో ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరి మాటలే వీరికి సమస్యలను తీసుకొస్తాయి. అందువలన మిథున రాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటంబంలో మనశ్శాంతి లోపిస్తుంది.
కర్కాటక రాశి( Cancer )
కార్తీక అమావాస్య రోజున కర్కాటక రాశి వారిని అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఊహించని విధంగా అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. సమయానికి డబ్బు అందక కూడా ఇబ్బంది పడుతారు. కుటుంబ సభ్యుల మధ్యన బేధాభిప్రాయాలు ఏర్పడి మనశ్శాంతి కరువు అవుతుంది.
కన్యా రాశి( Virgo )
కార్తీక అమావాస్య మూలంగా కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. విమర్శలకు గురవుతారు. ఏ పని తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది. వ్యతిరేకత కూడా అధికమవుతుంది. ఆర్థిక కష్టాలు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తాయి. పెట్టుబడుల్లో భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్.
మకర రాశి( Capricorn )
మకర రాశి వారిని కూడా కార్తీక అమావాస్య వేధిస్తుంది. ఈ రాశి వారికి పని భారం కూడా పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా అసంపూర్తిగానే మిగిలిపోతాయి. ఆర్థిక సమస్యలు అధికమై ఆందోళనకు గురవుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక బంధంలో కూడా సమస్యలు ఎదురవుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram