MariGold | బంతి పువ్వుతో ఆర్థిక కష్టాలు దూరం..! బుధవారం ఇలా చేయండి మరి..?
Mary Gold | ఇంట్లో కానీ, ఆలయంలో కానీ పూజ చేస్తున్నామంటే పువ్వులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. దేవుళ్లను అనేక రకాల పూలతో అలంకరించి.. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలుతాం. అసలు పుష్పం లేకుండా ఏ దేవుడికి కూడా పూజ జరగదు.
MariGold | ఇక ఈ పూజ కోసం అనేక రకాల పూలను వినియోగిస్తుంటారు. మరి ముఖ్యంగా బంతి పువ్వును వినాయకుడికి సమర్పించి పూజిస్తే.. ఎన్నో రకాల లాభాలు జరుగుతాయట. సదరు వ్యక్తికి గౌరవాన్ని, జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే సనాతన ధర్మంలో బంతి పూలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. వీటిలోని పసుపు, నారింజ రంగులు సానుకూల శక్తికి, సమృద్ధికి చిహ్నాలు.
బుధవారం వినాయకుడికి సమర్పిస్తే..
గణనాథుడికి బంతి పూలంటే ఎంతో మక్కువ. ప్రతి బుధవారం ఇంట్లో కానీ, ఆలయంలో కానీ విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో బంతి పువ్వులను సమర్పించాలి. దీంతో గణనాథుడి సంతోషిస్తాడట. ఇలా గణపతికి బంతిపువ్వులను సమర్పించి పూజించడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయట. ఆటంకాలు కూడా తొలగిపోతాయట. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిలుతారట. విద్యార్థులకు విద్యాబుద్ధులు లభిస్తాయట. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పూలు అర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, గురువారం విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల జ్ఞానం, సంతాన సుఖం కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతోంది. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా సాగడానికి బంతి పూల మాలలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram