Shravana Masam | శ్రావణ మాసంలో పెళ్లిళ్లకు అనుకూల తేదీలివే..! ఆ రెండు రోజులు అత్యంత శుభకరమట..!!
Shravana Masam | శ్రావణ మాసం రావడంతో మళ్లీ శుభ ఘడియలు వచ్చేశాయి. మళ్లీ నెల రోజుల పాటు శుభ కార్యాలు( Shubha Karyam ) చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. దాదాపు 15 రోజులు శుభ ముహుర్తాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో పెళ్లిళ్లు( Marriages ), గృహ ప్రవేశాలకు మంచి ముహుర్తాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Shravana Masam | ఆషాఢ మాసం ముగిసింది. శ్రావణ మాసం( Shravana Masam | ) ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరి వారంతో శుభ ఘడియలు( Shubha Ghadiyalu ) ముగిసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు ఏ శుభకార్యం కూడా జరగలేదు. శ్రావణ మాసం రావడంతో మళ్లీ శుభ ఘడియలు వచ్చేశాయి. మళ్లీ నెల రోజుల పాటు శుభ కార్యాలు( Shubha Karyam ) చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. దాదాపు 15 రోజులు శుభ ముహుర్తాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో పెళ్లిళ్లు( Marriages ), గృహ ప్రవేశాలకు మంచి ముహుర్తాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసం సెప్టెంబర్ 3వ తేదీన ముగియనుంది. కాబట్టి ఈ నెల రోజులు దాటితే మళ్లీ కార్తీక మాసం వచ్చే వరకు శుభ ముహుర్తాలకు వేచి ఉండాల్సిందే. అందుకే ఇప్పటికే పెళ్లిళ్లకు, గృహ ప్రవేశాలకు, ఇతర శుభకార్యాలకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్న వారు ఈ తేదీల్లో ముహుర్తాలు పెట్టేసుకోంది.
నేటి నుంచి 28వ తేదీ దాకా అన్ని మంచి రోజులే..
ఆగష్టు 7, 8, 9, 10, 11 , 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన 12, 13, 14, 19, 20, 25, 26, 27 తేదీల్లో ఎందుకు ముహూర్తాలు లేవనే సందేహం వచ్చి ఉంటుంది. అవి అష్టమి, నవమి తిథులు వచ్చిన రోజులు. శ్రావణ మాసం మొత్తంలో 17, 18 తేదీలు అత్యంత శుభకరంగా ఉన్నాయని ఈ రెండు రోజుల పాటు శుభకార్యాలు హోరెత్తిపోయే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.