దేవాలయాలను కాపాడితేనే చరిత్ర నిలుస్తుంది…

నాగులపహాడ్ శివాలయాల శిల్ప వైభవం రాష్ట్రంలోనే అత్యంత అరుదైనదని, ఇటువంటి కళా సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఈ ఆలయాలను పరిరక్షించాలని కోరారు. అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే నాగులపహాడ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే చారిత్రక వారసత్వ క్షేత్రంగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు.

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నాగులపహాడ్ ప్రాచీన శివాలయాలను రాష్ట్ర మాజీ ఆర్టీఐ చైర్మన్, సీనియర్ పత్రికా సంపాదకులు, విద్యావేత్త కట్టా శేఖర్ రెడ్డి సందర్శించారు. ఆలయాల దుస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అపూర్వమైన శిల్పకళ, అద్భుతమైన నిర్మాణ శైలి, ప్రతి రాతిలో చరిత్రను చెక్కిన ఈ ఆలయాలు నేడు నిర్లక్ష్యానికి గురవడం అత్యంత బాధాకరమన్నారు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనమైన వరంగల్ వేయి స్తంభాల గుడి నిర్మాణానికి నాగులపహాడ్ ఆలయాలే స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు. అలాంటి చారిత్రక కట్టడాలు మరుగున పడిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

నాగులపహాడ్ శివాలయాల శిల్ప వైభవం రాష్ట్రంలోనే అత్యంత అరుదైనదని, ఇటువంటి కళా సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఈ ఆలయాలను పరిరక్షించాలని కోరారు. అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే నాగులపహాడ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే చారిత్రక వారసత్వ క్షేత్రంగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు.

“చరిత్రను నిర్లక్ష్యం చేయడం అంటే మన మూలాలను కోల్పోవడమే. అందుకే నాగులపహాడ్ శివాలయాల పరిరక్షణలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పురావస్తు శాఖతో పాటు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయాలను కాపాడితనే చరిత్ర నిలుస్తుందని, చరిత్రను కాపాడుకుని భావితరాలకు అందిద్దామని అన్నారు. వాటి ద్వారానే భవిష్యత్‌ తరాలు తమ మూలాలను తెలుసుకుంటాయని చెప్పారు.

అంతకుముందు త్రికుటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కట్టా శేఖర్ రెడ్డి.. అనంతరం మూడు గంటల పాటు శిథిలావస్థలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 11–12వ శతాబ్దాలకు చెందిన ఈ చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Latest News