Coconut | కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభానికి సంకేతమా..? పువ్వు వస్తే దేనికి సంకేతం..?
Coconut | మన ఇంట్లో ఏదైనా శుభకార్యం( Spiritual Function ) జరిగినప్పుడు లేదా ఆలయాలకు( Temples ) వెళ్లినప్పుడు మొక్కులు తీర్చుకునేందుకు కొబ్బరికాయలు( Coconut ) కొడుతుంటాం. ఎలాంటి పూజ( Pooja ) అయినా సరే.. కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. ఆలయానికి వెళ్లినా కూడా కొబ్బరికాయ కొడితేనే మనసు సంతృప్తిగా ఉంటుంది.

అయితే ఇంట్లో శుభకార్యం సమయంలో కానీ, ఆలయంలో కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోవమో, దాంట్లో పువ్వు రావడమో జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మందిలో కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభానికి సంకేతమా? పువ్వు వస్తే దేనికి సంకేతం? వంటి చిన్నచిన్న సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ, దేవుడి కోసం కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే మంచిదా? చెడుకు సంకేతమా? పువ్వు వస్తే ఏం జరుగుతుంది? మరి ఇలాంటి సందేహాలకు సమాధానం దొరకాలంటే.. మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
కొబ్బరికాయ కుళ్లిపోతే ఏం జరుగుతుందంటే?
పూజా కార్యక్రమాల సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు కనిపిస్తే ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పువ్వు వచ్చిన టెంకాయను పక్కనపెట్టేసి మరో కొబ్బరికాయతో పూజను పూర్తి చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతున్నదనీ, త్వరలోనే బారసాల చేస్తారనే నమ్మకం కూడా ఉందని చెబుతున్నారు.
ఇక, కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోయినా అశుభమేమీ కాదంటున్నారు. అలా కుళ్లిపోవడం “శుభసూచకం” అని కూడా అంటారని చెబుతున్నారు. ముఖ్యంగా దిష్టి తీసే క్రమంలో టెంకాయ కుళ్లిపోతే మంచిదనే విశ్వాసం చాలా ప్రాంతాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.