Ugadi Rasi Phalau 2025 | శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో.. ధనుస్సు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!
Ugadi Rasi Phalau 2025 | మరో రెండు రోజుల్లో కొత్త తెలుగు సంవత్సరం( Telugu Calendar )లోకి అడుగుపెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసు సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara ) మార్చి 30న ప్రారంభం కానుంది.
Ugadi Rasi Phalau 2025 | మరో రెండు రోజుల్లో కొత్త తెలుగు సంవత్సరం( Telugu Calendar )లోకి అడుగుపెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసు సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara ) మార్చి 30న ప్రారంభం కానుంది. అదే రోజు ఉగాది పండుగ( Ugadi Festival )ను నిర్వహించకోబోతున్నాం. ఇక జ్యోతిష్య పండితులు తెలుగు కాలమాన సంవత్సరం ప్రకారం పంచాంగ శ్రవణం చేయనున్నారు. అయితే ఈ ఏడాది ధనుస్సు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఏప్రిల్ 2025
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగును. నూతన వాహన సౌఖ్యం ఏర్పడును. సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతం అగును. ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలు. సమయానుకూలత చూసుకొని ఉన్నత అధికారులతో సంప్రదింపులు చేయవచ్చు. మిత్ర వర్గం సలహాల వలన మేలు జరుగుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్ధిక వ్యయం అదుపులోకి తెచ్చుకొంటారు. 17, 18, 19, 20 తేదీలలో ఒక అశుభ వార్త వినడానికి సూచనలు కలవు. 23 వ తేదీ తదుపరి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలకు అనువైన కాలం. మహిళలకు ఆరోగ్యం సహకరిస్తుంది.
మే 2025
ఈ మాసంలో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు , నూతన ఉద్యోగ జీవన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించదేరు. కుటుంబానికి పూర్వ వైభవం తెస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం బలంగా ఉన్నవారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం అనువైన కాలం. అధికారుల ఒత్తిడి తగ్గును. 8 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఒక ఆపద నుండి బయటపడతారు. శత్రుత్వాలు తొలగి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకోగలరు. నూతన ఆరోగ్య పద్దతులు అలవాటు చేసుకొంటారు. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం ఆశించినంతగా ఉండును.
జూన్ 2025
ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు కొనసాగును. బంధు వర్గం సహకారం వలన చక్కటి వివాహ సంబంధాలు లభించును. వ్యక్త్రిగత వైవాహిక జీవనంలో కూడా అపార్ధాలు తొలగును. సౌఖ్యం ఏర్పడును. విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకొందురు. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు పొందుతారు. నూతన కాంట్రాక్టులు, విదేశయానం చేసేందుకు అవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలు నిరుత్సాహ పరుచును. సేవా రంగంలోని వారు లక్ష్యాలను చేరుకొందురు. మొహమాటం వలన నష్టపోదురు. ఈ మాసంలో ప్రయాణాలు కలసిరావు. అవాంతరాలను ఏర్పరచును.
జూలై 2025
ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. చేపట్టిన పనులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగక ఇబ్బందులను ఎదుర్కొనును. తోటి ఉద్యోగుల నుండి రావలసిన సహకారం సకాలంలో లభించదు. ఆశించిన గుర్తుంపు లభించదు. నూతన అవకాశములు చేజారిపోవును. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. కుటుంబ పెద్దల ప్రవర్తన వలన సమస్యలు. అనుకోని కలహాలకు అవకాశముంటుంది. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలలో ఓర్పు అవసరం. ఈ మాసంలో 2, 6, 7, 18, 25, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు. ఆర్ధికంగా వృధా ఖర్చులు ఏర్పడును.
ఆగష్టు 2025
ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఇబ్బందులు తొలగును. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ సామర్ధ్యం పై నమ్మకముంచండి. 8, 9, 10 మరియు 11 తేదీలలో నూతన అవకాశములు, అధికారుల ప్రోత్సాహం లభించును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభించును. క్రమంగా అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు బాగా లాభపడతారు. వృత్తి పరమైన వ్యాపారాలు కూడా బాగుంటాయి. మూలా నక్షత్ర జాతకులకు జూదం వలన పెద్దమొత్తంలో నష్టములు ఏర్పడును. కుటుంబ జీవనంలో ఆశించిన ఫలితాలు ఏర్పడును. సంతానానికి భవిష్యత్ నిధిని ఏర్పాటు చేయగలుగుతారు.
సెప్టెంబర్ 2025
ఈ మాసంలో వ్యక్తిగత జీవితంలో ఇతరుల ప్రమేయం వలన ఒక నష్టం ఏర్పడును. జీవిత భాగస్వామి ఫై అపోహలకు తావివ్వకండి. మాత్రు వర్గం వారికి కొద్దిపాటి అనారోగ్య సమస్య. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ధనార్జన ఆశించిన విధంగానే ఉండును. సంతానం యొక్క పురోగతి ఆనందాన్ని కలుగచేస్తుంది. ద్వితీయ తృతీయ వారాలాలో ఉద్యోగులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. చిన్న అవకాశాలు కూడా భవిష్యత్లో మంచి చేస్తాయి. అవకాశములను వదులుకోకండి. అతి తెలివితేటలు ప్రదర్శించుట , తర్కంగా ఆలోచించుట మంచిది కాదు. చివరి వారంలో రాజకీయ రంగంలోని వారికి పదవీయోగం ఉన్నది. ప్రయత్నాలు చేయండి.
అక్టోబర్ 2025
ఈ మాసంలో నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఏర్పడును. శ్రమ అధికం అయినా పట్టుదలతో పని చేస్తారు. స్థాన చలన , ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో సంతోష జీవనం. ధనాదాయం బాగుండును. జీవన మార్గంలో ఆశించిన మార్పులు ఏర్పడతాయి.
నవంబర్ 2025
ఈ మాసంలో ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో స్వల్ప ఆటంకాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు గౌరవ హాని సంఘటనలు కలవు. మాట విలువ తగ్గుతుంది. ఇతరులను విమర్శించుట వలన సమస్యలను కోరి తెచ్చుకుంటారు. మాటలయందు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగును. ధనాదాయంలో నిలకడ లోపిస్తుంది. ఆర్ధిక విషయాలలో ప్రణాళిక అవసరం. కోర్టు లావాదేవిల వలన ధన వ్యయం అధికమగును. వివాహ ప్రయత్నాలు బెడిసికోట్టును. చివరి వారంలో ఒక ప్రమాదం లేదా పెద్ద నష్టం. నిదానంగా నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును.
డిసెంబర్ 2025
ఈ మాసంలో ధనాదాయం తగ్గును. ఆశించిన ధనం చేతికి వచ్చుట కష్టం. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందులు కలుగచేయును. పట్టుదలలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండవలెను. నిరుద్యోగులకు నిరాశాపూరితమైన కాలం. ప్రారంభించిన పనులు ముందుకు సాగవు. మిత్ర బలం కూడా తగ్గుతుంది. సున్నితమైన విషయాలలో మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ముఖ్యంగా స్వ ఆరోగ్య విషయంలో భయానికి లోనగు అవకాశం అధికం. ఈ మాసంలో 8, 12, 14, 21, 22 తేదీలు ఎదో ఒక అంశంలో నష్టాన్ని ఏర్పరచు సూచన.
జనవరి 2026
ఈ మాసంలో కూడా సమస్యలు కొనసాగును. ఆదాయం గత మాసం కన్నా కొంచం పెరుగును. ఆర్ధిక విషయాలలో సహాయం లభిస్తుంది. ప్రధమ వారంలో ఒక ముఖ్య వార్త వింటారు. గృహ మార్పిడి లేదా నిర్మాణ పనులలో మిక్కిలి అవాంతరాలు లేదా అతి వ్యయం. ఆందోళన పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు బాధించును. ఉద్యోగ కార్యములు పూర్తి చేయుటకు శక్తికి మించి కష్టపడతారు. సోదర వర్గంతో మాట పట్టింపు విడిచిపెట్టుట మంచిది. నూతన వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ప్రత్యర్ధుల నుండి వ్యతిరేకత అధికం అవుతుంది. వ్యాపార పరంగా నష్టములు పొందు సూచనలు అధికం.
ఫిబ్రవరి 2026
ఈ మాసంలో విరివిగా ప్రయాణాలు ఏర్పడును. ప్రయత్నపుర్వక కార్య లాభాలు ఏర్పడును. గాడి తప్పిన ఆర్ధిక విషయాలు క్రమంగా దారిలోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ప్రోత్సాహక కాలం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇబ్బందుల నుండి బయటపడతారు. శత్రు విజయం ఏర్పడుతుంది. గృహంలో శుభ పరిణామాలు ఉన్నాయి. గొప్ప స్థాయి వ్యక్తుల ద్వారా లాభపడతారు. మాసాంతంలో సంతానం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో 4, 5, 6 తేదీలు నూతన ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి.
మార్చి 2026
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ధనాదాయం పర్వాలేదు. భాగస్వామ్య వ్యాపారములలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు ప్రాప్తించును. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక అశుభ వార్త. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యంలో ఖర్చులు అధికంగా ఉండును. పుబ్బా నక్షత్ర జాతకులకు వివాహ సంతాన విషయాలలో వ్యతిరేక ఫలితాలు. చివరి వారంలో దైవదర్శన భాగ్యం, ఒంటరిగా ప్రయాణం చేయాలనే కోరిక నెరవేరును. విద్యార్దులు శ్రమించవలెను. ఈ నెలలో 2,6,7,15,29 తేదీలు మంచివి కావు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram