Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ విజయం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో సమన్వయం పాటిస్తే బంధాలు బలపడతాయి. పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కష్టపడి పనిచేసినప్పటికీ విజయం లభించదు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. ప్రయాణంలో ఆటంకాలు ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఫలిస్తాయి. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల మన్ననలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. సన్నిహితులతో ఆనందప్రదమైన క్షణాలు గడుపుతారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా ప్రణాళికతో నడుచుకోవాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ప్రతికూలత పరిస్థితులు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్లు ఎదురైనప్పటికి కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవచ్చు. వాయిదా వేస్తే మంచిది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు అందుకుంటారు. కీలక సమావేశాలు చర్చల్లో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి పరంగా అందిన ఒక శుభవార్త ఉత్సాహం కలిగిస్తుంది. సోదరులతో బంధువులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు అద్భుతమైన కాలం. మీ కృషికి తగిన గుర్తింపు, లాభాలు లభిస్తాయి. నలుగురు గుర్తించేలా జీవితంలో ఎదుగుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు చక్కగా పనిచేస్తాయి. ఒక శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వలన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరగవచ్చు. సమయపాలనతో ఒత్తిడి అధిగమించవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అధిక ఖర్చులు నియంత్రించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపు, ప్రణాళికతో వ్యవహరిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించవచ్చు. ఉద్యోగులు అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. కుటుంబ కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో ప్రశాంతత పొందవచ్చు. ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. పట్టుదలతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించి లక్ష్యాలను సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అద్భుతమైన రోజు. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram