Ganesh Chaturthi | గణేశ్ మండపంలో గణనాథుడి చిన్న విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాలా..?
Ganesh Chaturthi | గణేశ్ నవరాత్రుల సందర్భంగా గల్లీకో గణేశుడు( Ganesh ) దర్శనమిస్తున్నాడు. అయితే భారీ వినాయక విగ్రహాల( Vinayaka Statue ) వద్ద చిన్న గణనాథుడి విగ్రహాన్ని పెడుతుంటారు. మరి తప్పనిసరిగా చిన్న విగ్రహాన్ని పెట్టాలా..? ఒక వేళ పెట్టకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం.
Ganesh Chaturthi | వినాయక చవితి( Vinayaka Chavithi ) సందర్భంగా భక్తులు( Devotees ) తమ కాలనీల్లో భారీ గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇక వినాయక మండపాలను( Ganesh Pandals ) ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ప్రతి భారీ లంబోదరుడి విగ్రహం వద్ద.. ఒక చిన్న గణేశ్ విగ్రహాన్ని ఉంచుతుంటారు. అసలు ఈ చిన్న వినాయక విగ్రహాన్ని ఎందుకు ఉంచుతారు..? దాని వెనుకాల కారణాలు ఏంటో తెలుసుకుందాం..
వక్ర తుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వ కార్యేషు సర్వదా॥
అని రోజూ మనం గణపతిని ప్రార్థిస్తాం. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపజేస్తూ, వంకర తిరిగిన తొండంతో అనుగ్రహించే ఓ దైవమా.. మేం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలూ రాకుండా చూడమని వేడుకుంటూ వినాయకుణ్ని స్తుతించే శ్లోకం ఇది.
విఘ్నేశ్వరుడిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతి రోజూ షోడశ ఉపచారాలతో విధిగా పూజిస్తుంటారు భక్తులు. నిత్యపూజల్లో, శుభకార్యాల్లో మొదటి పూజ విఘ్నేశ్వరుడికే చెల్లుతుంది. ఇక వినాయక చవితి సందర్భంగా ప్రతి గల్లీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి భారీ విగ్రహాలను నెలకొల్పుతారు. ఈ చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.
భక్తులంతా ఆ వేడుకల్లో పాలుపంచుకుంటారు. ప్రతిరోజూ మండపంలో ఉన్న భారీ విగ్రహాన్ని పూజించడానికి సౌకర్యంగా ఉండదు. కాబట్టి, ప్రత్యామ్నాయంగా నిత్యపూజ నిర్వహించడానికి వీలుగా గణనాథుడి చిన్న విగ్రహాన్ని కూడా మండపంలో పెట్టి, ఆవాహనం చేసి పూజించే సంప్రదాయం ఏర్పడింది. ఇది లోకాచారమే కానీ, చిన్న విగ్రహం తప్పనిసరిగా కొలువుదీర్చాలనీ, దానికే పూజలు నిర్వహించాలనే దానికి శాస్త్ర ప్రమాణం లేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram