హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో, శ్రమతో, పాండితీ ప్రకర్షతో మన కన్నులముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న శ్రమైక జీవన సౌందర్యమైన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పుణ్యమా అని.. హైదరాబాద్ నార్సింగ్ వద్ద ఉన్న బహుళ అంతస్థుల అత్యాధునిక మై హోమ్ అవతార్ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టానికి తెరలేచి జంట నగరాల మేధో సమాజాల్లో, భక్త బృందాల మధ్య, కవి పండితుల, ఆలయ అధికార అర్చకుల మధ్య చర్చకు దారి తీయడం ఇటీవలి కాలంలో ఒక మహత్తరపరిణామంగా చెప్పక తప్పదు.
వివరాల్లోకి వెళితే .. ఒక రచయిత ఒక పుస్తకం ముద్రించుకుని.. మార్కెట్‌లో పెట్టడమే కష్టమైన ఇప్పటి ఇంటర్నెట్ తరుణంలో కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ బుక్స్‌కి ఉన్న డిమాండ్‌కి పీఠాధిపతులు, మఠాధిపతులు సైతం ముక్కున వ్రేలేసుకున్న సంగతి మనకి తెలిసిందే!

పరమ ఋషుల వరప్రసాదంగా అందిన స్తోత్రాలకు పురాణపండ శ్రీనివాస్ అందించే ముందుమాటలకూ, అత్యద్భుతమైన అరుదైన చిత్రాలకూ శ్రీనివాస్‌కి చాలా కాలంగా లక్షల భక్త పాఠకుల్లో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు.జీవన పోరాటంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న శ్రీనివాస్ తనకి ప్రాణచైతన్యమైన దైవీయ మార్గాన్ని ఏనాడూ విడిచిపెట్టకపోవడం వల్లనే ఎన్నో అప్రతిహత జైత్రయాత్రలు ఆయన ఖాతాలోకి చేరుతున్నాయని విజ్ఞులు ఘంటాపధంగా చెబుతున్నారు.
ప్రధానాంశంలోకి వస్తే.. మై హోమ్ అవతార్ ప్రాంగణంలో ఈ శనివారం పురాణపండ శ్రీనివాస్ సృజించిన రెండు లక్షల శైవ వైష్ణవ గ్రంధాలు.. ఒక్కొక్కటి లక్ష ప్రతులు చొప్పున రెండులక్షల గ్రంధాలు ఒకేసారి ఆవిష్కరణ జరుపుకోవడం హైదరాబాద్‌లోనే చారిత్రాత్మక విషయం. ఒక గ్రంధం విష్ణు భగవానుని గ్రంధం కాగా.. రెండవది శివ భగవానుని అనుగ్రహ గ్రంధం.

మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కిష్ణయ్య సౌహార్ద్ర హృదయంతో సమర్పించిన ఈ విలువైన రెండు లక్షల గ్రంధాలు వందలకొలది కాటన్ బాక్సస్‌లో అక్కడ కొలువు తీరడం వెనుక ఉత్పల జగన్మోహిని, గాంధీ చంద్రశేఖర్ బృందం కష్టం, భక్తి ప్రస్ఫుటంగా దర్శనమిచ్చింది. సుమారు రెండున్నర గంటలసేపు ఈ మహా ఉదాత్త కార్యాన్ని అత్యంత సమర్ధవంతంగా పరమ భక్తి రసాత్మక వాతావరణంలో నడిపించిన జగన్మోహిని, చంద్రశేఖర్‌లను మై హోమ్ అవతార్ వాసులు ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు.
మై హోమ్ అవతార్ ప్రముఖులు డి. ప్రభాకరరెడ్డి, సంకష్టహర హనుమాన్ దేవస్థానం చైర్మన్ టి. అంజన్ కుమార్, సంకష్టహర హనుమాన్ దేవస్థానం కార్యవర్గప్రతినిధి వినోద్ కుమార్ సైతం ఎంతో ఉత్సాహవంమైన భూమికను నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. గాంధీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఎందరో భక్తులు లక్షల గ్రంధాలపై మల్లెలు, చేమంతులు వెదజల్లడం గమనార్హం. అలాగే సభలో వేదం పండితుల వేదఘోషలమధ్య మొత్తం కమిటీని ఉత్పల జగన్మోహిని పరిచయం చేశారు.

అక్కడి మై హోమ్ అవతార్ కమిటీ ప్రతినిధుల ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి జయో పలికారు. ఈ శ్రీ కార్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఏకధాటిగా పదకొండు నిమిషాలు చేసిన ప్రసంగం సభికుల్ని ఆకట్టుకోవడమే కాకుండా చప్పట్లు వన్స్ మోర్ కొట్టించింది.
ఏదేమైనా ఇటీవలి కాలంలో ఇలాంటి ముగ్ధమనోహారమైన పవిత్రకార్యం ఎక్కడా జరగలేదని.. ఇది ఎంతో ఆనందాన్నిచ్చిందని.. సభికులే స్వయంగా ఒక్కొక్కరూ ఒక్కక్కరూ ఒక్కొక్క వందపుస్తకాలు శివ, విష్ణు గ్రంధాలు తమతో తీసుకెళ్లడం ఆశ్చర్యంతోపాటు భక్తినివ్వడంతో మరింత భక్తి రసోన్మత్తంగా ఉందని పలువురు మీడియాతో స్వయంగా పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉండగా పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీమాలిక గ్రంధం సుమారు ఇరవై ప్రచురణలకు నోచుకోవడం తెలుగునాట ప్రచురణకర్తలకు ఒక హాట్ టాపిక్ అవ్వడం కూడా తిరుమల శ్రీనివాసుని అఖండ అనుగ్రహమేనని తిరుమల శ్రీవారి ఆలయ మహాక్షేత్ర ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఇటీవల రెండు మూడు పర్యాయాలు పేర్కొన్నట్లు మీడియా ఉవాచ.
ఎన్ఠీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరికి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కిష్ణయ్యకి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు ప్రకటించారు.
