Dreams | ప్రతి మనిషికి రాత్రి సమయాల్లో కలలు పడుతుంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని కలలు జీవితంలో రానున్న కష్టాలు, నష్టాలను సూచిస్తాయి. ఇక అప్పుడప్పుడు భయంకరమైన కలలు పడడంతో నిద్రలోనే ఉలిక్కి పడుతుంటారు. లేచి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు. అయితే పురుషులు, మహిళలు రకరకాల కలలు కంటారు. మహిళలకు ఈ ఐదు రకాల కలలు పడితే ఎంతో శుభప్రదం అని స్వప్న శాస్త్రం తెలుపుతుంది. మరి ఆ ఐదు రకాల కలలు ఏవో తెలుసుకుందాం..
ఐదు రకాల కలలు ఇవే..
ఆభరణాలు కలలో కనిపిస్తే..
పెళ్లి కాని యువతులకు కలలో వజ్రాలు లేదా వజ్రాలతో కూడిన ఆభరణాలు కనిపిస్తే.. వారు ఉన్నత స్థాయి అధికారిని లేదా ధనిక వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకుంటారని నమ్మకం.
పక్షులు కనిపిస్తే..
స్త్రీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమెకు కలలో అందమైన పక్షి కనిపిస్తే వారి ప్రేమ.. పెళ్లిగా మారుతుందట. ఈ ప్రేమపెళ్లికి కూడా ఎక్కువకాలం పట్టదట. కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సూచన.
మంచం కనిపిస్తే..
ఎవరైనా స్త్రీ మంచం మీద పడుకున్నట్లు కలగంటే ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుడిని లేదా భాగస్వామిని కలుసుకోనున్నదని అర్ధం. ఆ సంబంధం పెళ్లికి దారి తీస్తుందట.
కలలో కార్మికుడిని చూడటం
యుక్తవయస్సు లేదా యువతికి కలలో పనులు చేసుకుంటున్న కార్మికుడు కనిపిస్తే.. ఆ యువతికి త్వరలో శివుడిలా ప్రేమించే వరుడు లభిస్తాడని అర్థం. అతనితో డేటింగ్‌కు కూడా వెళ్ళే అవకాశం ఉంది.