Today Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? ఈ రాశుల వారికి గొప్ప శుభ‌ఫ‌లితాలు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Today Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? ఈ రాశుల వారికి గొప్ప శుభ‌ఫ‌లితాలు..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా క్రీడారంగం, సాంకేతిక రంగాల వారికి గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు పట్టం కడతారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారు నిరాశకు గురి కావచ్చు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. ఆర్ధికంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన కృషితోనే విజయం సిద్ధిస్తుంది. కుటుంబ కలహాలతో విసిగి పోతారు. మనశ్శాంతి లోపిస్తుంది. సహనం వహించండి. ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకు రాబడి బాగుంటుంది.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యం, ఆకట్టుకునే వైఖరితో అందరినీ మెప్పిస్తారు. ఎక్కడా ప్రతికూలతలు ఉండవు. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. పలు మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పెద్దలను కలుసుకొని వారి సహకారం తీసుకుంటారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి.

తుల

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు విపరీతమైన చికాకు కలుగుతుంది. తీవ్రమైన పని ఒత్తిడితో అలిసిపోతారు. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకుంటే మీ కోపం సన్నిహితులతో సంబంధాలను దెబ్బతీస్తుంది. ఆర్ధిక మోసాల పట్ల అవగాహనతో ఉండాలి. లేకుంటే ధననష్టం సంభవించవచ్చు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఆర్థికపరంగానూ, వృత్తి వ్యాపారాలలో గొప్ప లాభాలు, పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. మితిమీరిన అహంకారంతో ప్రవర్తించే వారికి దూరంగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఆర్ధికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఇంటా బయటా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంది. ఈ రాశి వారికి ఈ రోజు విదేశీ ప్రయాణానికి శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. అన్ని రంగాల వారు వృత్తి పరంగా అద్భుతంగా రాణిస్తారు. ఆర్ధికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు, ఒప్పందాలు చేపట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో గొప్ప మార్పులు జరుగుతాయి. నూతన బాధ్యతలు చేపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.