Vastu Tips | మనీ ప్లాంట్ ఆ దిశలో వేలాడుతుందా..? అయితే ఆర్థిక నష్టాలే..!
Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల.. ఆ ఇంట ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ నివాసంలో మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు.
Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల.. ఆ ఇంట ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ నివాసంలో మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు. అయితే ఈ ప్లాంట్ ఎదిగే క్రమం.. తీగ పెరిగే దిశ కూడా చాలా ముఖ్యమని వాస్తు పండితులు పేర్కొంటున్నారు. ఏ దిశలో తీగ పెరిగితే నష్టమో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచుకుంటే ఆ ఇంట ఆర్థిక శ్రేయస్సు కలిగి సంపద సమకూరుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం. సంపద పెరగడమే కాదు.. ఆ మొక్క ఎదుగుదల ఆ ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ మొక్క నాటిన దిశ నుంచి ఎత్తుకు పెరిగితే మంచిది. కానీ అలా కాకుండా కింది వైపు తీగ వేలాడితే అశుభమని పండితులు చెబుతున్నారు.
మనీ ప్లాంట్ తీగ భూమి వైపు వేలాడితే.. అనేక ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయట. సంపద పెరగడం నిలిచిపోయి.. డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుందట. అప్పులు పెరిగిపోతాయట. ఆర్థిక సమస్యలతో కుటుంబ సభ్యులందరూ సతమతమవుతారట.
అందువలన ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ నేలవైపు చూసేలా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలట. అంతే కాకుండా, మనీ ప్లాంట్ సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే అది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. అందువలన ఈ మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ, ఆగ్నేయ దిశలో మాత్రమే నాటాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram