Broom | చీపురును ఈ దిశలో ఉంచండి..! అష్టైశ్వరాలు పొందండి..!!
Broom | ప్రతి గృహంలో చీపురు ఉంటుంది. ఇల్లును శుభ్రం చేసేందుకు చీపురును వినియోగిస్తారు. ఇక ఇల్లును ఊడ్చిన తర్వాత ఆ చీపురును ఎక్కడంటే అక్కడ పడేస్తారు.. దానికంటూ ఓ విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తారు. ఇది తప్పని పండితులు చెబుతున్నారు.
Broom | ప్రతి గృహంలో చీపురు ఉంటుంది. ఇల్లును శుభ్రం చేసేందుకు చీపురును వినియోగిస్తారు. ఇక ఇల్లును ఊడ్చిన తర్వాత ఆ చీపురును ఎక్కడంటే అక్కడ పడేస్తారు.. దానికంటూ ఓ విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తారు. ఇది తప్పని పండితులు చెబుతున్నారు. చీపురుకు కూడా వాస్తు నియమాలు ఉన్నాయని, వాటిని తూచా తప్పకుండా పాటిస్తేనే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్పష్టం చేస్తున్నారు. మరి ఆ వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం..
రెండు చీపుర్లను ఒకేచోట ఉంచొచ్చా..?
చాలా నివాసాల్లో ఒకట్రెండు చీపుర్లు ఉంటాయి. కొందరి ఇళ్లల్లో రెండుకు పైగా కూడా ఉంటాయి. అయితే ఇలాంటి వారు రెండు చీపుర్లను కలిపి ఒకే చోట ఉంచకూడదు. రెండింటిని ఒకేచోట ఉంచడం వల్ల ఆ ఇంట్లో అశుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
చీపురును పడుకోబెట్టాలా..? నిలబెట్టాలా..?
ఇల్లును ఊడ్చిన తర్వాత చీపురు పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా చీపురును తలకిందులుగా, అనగా ఊడ్చే భాగం పైకి ఉండేలా నిలువుగా లేదా పడుకోబెట్టి ఉంచాలి.
చీపురును ఏ దిశలో ఉంచాలి..?
చీపురును పెట్టే స్థలం కూడా చాలా ముఖ్యం. ఈశాన్య మూలలో చీపురును అస్సలు ఉంచకూడదు. ఈశాన్యం అనేది దైవిక శక్తికి సంబంధించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. చీపురును నైరుతి లేదా పడమర దిశలో ఉంచడం శ్రేయస్కారం.. ఇది ఆర్థిక సమస్యలను తగ్గించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
అథితులకు చీపురు కనిపించొచ్చా..?
అలాగే, ఇంట్లోకి వచ్చే అతిథులకు లేదా కుటుంబ సభ్యులకు తరచుగా కనిపించే ప్రదేశంలో చీపురును పెట్టడం మంచిది కాదు. ఎవరికీ కనిపించని, ఒక ప్రశాంతమైన మూలలో ఉంచడం శ్రేయస్కరం. చీపురు, చెత్తాచెదారం చూడడానికి ఇష్టపడరు కాబట్టి, వాటిని ఎవరి కంటా పడకుండా ఉంచడం మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram