23 జూన్ నుంచి 29వ‌ తేదీ వ‌ర‌కు.. ఈ వారం ఈ రాశుల వారికి అద్భుతం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

23 జూన్ నుంచి 29వ‌ తేదీ వ‌ర‌కు.. ఈ వారం ఈ రాశుల వారికి అద్భుతం..!

మేషం

ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. అదనంగా, కొత్త ఆదాయ మార్గాలు అందుకుంటారు. మొత్తం మీద ఈ వారం ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మీరు కలలు కనే విదేశీ ఉద్యోగాన్ని పొందుతారు. శత్రువుల నుంచి, అసూయపరుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు.

వృషభం

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. తొందరపాటు లేకుండా నిదానంగా వ్యవహరించడం మేలు. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటే సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహన ప్రమాదాలకు ఆస్కారముంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం ధనవ్యయం ఉంటుంది.

మిథునం

వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని స‌మ‌తుల్యం చేసుకుంటూ పని చేయడం వలన ఇంటా, బయట ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా వైద్యుని వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్య నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు వారం ప్రారంభంలో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సమష్టి కృషితో సాధించిన విజయాల ప్రయోజనం అందరికీ చెందేలా వ్యవహరిస్తే మేలు. వ్యాపారులకు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. లాభాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారు, ఉద్యోగులు తమ లక్ష్యంపై దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. అహంకారం, అధికార గర్వం వీడి అందరినీ కలుపుకొని పోవడం మంచిది.

సింహం

సింహరాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. జీవితభాగస్వామితో బంధాలు దృఢపడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. స్నేహితుల సాయంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా పనిచేసి సంస్థని అభివృద్ధి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వారం చివరలో విలాసాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి.

తుల

అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం, విజయం ఉంటాయి. ఉద్యోగులు చేపట్టిన ప్రతిపనిలోను విజయాన్ని సాధిస్తారు. నూతన బాధ్యతలను చేపడతారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంతో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళతారు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వృత్తి నిపుణులు, వ్యాపారులు సమష్టి కృషితోనే విజయాలు సాధిస్తారు. అధికారంతో దేన్నైనా సాధించవచ్చు అనుకుంటే పొరపాటు. ఇది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, మీ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తుంది. ఉద్యోగులు పని నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బహుశా విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎన్నో రోజుల నుంచి పెండిగ్​లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లకపోతే సమస్యలు తప్పవు. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారులు రుణాల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో చికాకు కలగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. కుటుంబంలో శాంతి కోసం తీవ్ర కృషి అవసరం.

మకరం

మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో పెద్దల పట్ల బాధ్యతతో మెలగండి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం అధికంగా డబ్బు ఖర్చవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మీనం

మీనరాశి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన కృషితో అఖండ విజయాలను సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఉద్యోగులు సంస్థ అభివృద్ధి కోసం, ఆర్థిక లాభాల కోసం పాటుపడతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.