Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశివారు జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు, జీతం పెంపు వంటి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కీలక నిర్ణయాల విషయంలో అందరితో సంప్రదించడం మంచిది. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. షేర్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞులు సంప్రదించడం మంచిది. వివాహ జీవితంలో, చిన్న సమస్యలు అవగాహనతో తొలగిపోతాయి. విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడండి. వృత్తిపరంగా ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులు, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు. వ్యాపారవృద్ధి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కెరీర్ పరంగా ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు మెరుగైన ఫలితాలను ఇవ్వవచ్చు. ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆశించిన పదోన్నతులు, బదిలీలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. కొత్త పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పురోగతి సాధిస్తారు. విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో విజయం సాధిస్తారు. విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ వారం ఆశాజనకంగా ఉంది. భాగస్వామ వ్యాపారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన ప్రణాళికతో ఆర్థికవృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రేమ విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు పొందుతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. స్వబుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఆచి తూచి నడుచుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. రుణభారం పెరగకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. తెలివిగా ఖర్చు పెట్టండి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా పురోగతికి చేసే ప్రయత్నాలకు అవరోధం కలగవచ్చు. ఉద్యోగంలో అధికశ్రమ, పనిఒత్తిడి ఉంటాయి. వ్యాపారాలు ఆచి తూచి నడుచుకోవాలి. అనుకోని సవాళ్లు ఎదురుకావచ్చు. ఆశించిన లాభాల కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీతో మెలగాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు మనస్పర్థలకు దారితీస్తాయి. విద్యార్థులకు, ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు పట్టుదలతో పనిచేసి స్థిరమైన ప్రగతిని సాధిస్తారు. ఉద్యోగంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వారం ఆరంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఏర్పడకుండా ముందుగా జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. ఊహించని సంఘటనల కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు వృథా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు సహనంతో ఉంటే మంచిది. ప్రేమ వ్యవహారాలు కలిసిరావు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడండి. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు విజయం సాధించడానికి శ్రద్ధ వహించాలి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు తమ ప్రతిభతో, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరగవచ్చు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి వ్యవహరించండి. ఖర్చుల విషయంలో తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఆస్తులు వృద్ధి చేస్తారు. భూగృహవాహన యోగాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో అవగాహనతో మెలిగితే మంచిది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు, స్దాన చలనం ఉండవచ్చు. దృఢమైన సంకల్ప శక్తితో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్లు ఉన్నా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. దైవదర్శనంతో ప్రశాంతత పొందుతారు. పెద్దల ఆశీర్వాద బలం అండగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్థులు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. నూతన ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram