Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీటలెక్కుతారు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కెరీర్ పరంగా బలమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పురోగతి స్థిరంగా ఉంటుంది. ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారులుగత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ఈ వారం ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కెరీర్ లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ స్థిరమైన ప్రగతి సాధిస్తారు. వృత్తిపరంగా ఈ వారం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి కారణంగా చాలా కష్టపడవలసి ఉంటుంది. సమయపాలన, క్రమశిక్షణ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో పురోగతి స్థిరంగా ఉంటుంది. లాభాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విపరీతమైన పోటీని ఎదుర్కోవడానికి నూతన వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఆదాయం పెరిగినప్పటికీ, ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముందుచూపు, సరైన ప్రణాళికతో ఖర్చులు అదుపు చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఘర్షణలకు తావు లేకుండా చూసుకోండి. వైవాహిక జీవితం సంతోషంగా, స్థిరంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం విజయ పరంపరలు కొనసాగుతాయి. ఉద్యోగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ ఎగుమతులు, దిగుమతులతో అధిక లాభాలు ఆర్జిస్తారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వలన ఇబ్బంది ఉండదు. పూర్వీకుల ఆస్థి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సవాళ్లు ఎదురు కావచ్చు. వ్యాపారంలో ఆటుపోట్లు ఆందోళన కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని విధంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉండవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు చోటుచేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సామరస్యం కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పదోన్నతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. ఆర్థికంగా బాగుంటుంది. షేర్ మార్కెట్లో పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుతాయి. వారసత్వపు ఆస్తుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా అవగాహనతో సర్దుకుంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఇది అద్భుతమైన సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. కీలక ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో పేరొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడుతాయి. పదోన్నతులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. రుణభారం తొలగుతుంది. ఖర్చులు తెలివిగా నిర్వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
తుల (Libra)
తులా రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం గొప్ప అభ్యున్నతి ఉంటుంది. ఉన్నత పదవులు పొందుతారు. అధికార పరిధి విస్తరిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన లాభాలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి లేకుండా చూసుకోండి. కుటుంబం వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జీవిత భాగస్వామితో సంయమనంతో వ్యవహరించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది. ఉద్యోగులు పూర్తి అంకితభావంతో పనిచేసి పదోన్నతులు, గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అధికార యోగం పడుతుంది. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. వ్యాపారాన్ని అనేక ప్రాంతాలకు విస్తరిస్తారు. స్థిరాస్తి రంగాల వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండవు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభలాభాలు చేకూరుతాయి. నిరంతర కృషితో లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటారు. ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు గణనీయంగా పేరుతాయి. స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్ని వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏర్పడే స్వల్ప వివాదాలు అవగాహనతో సర్దుకుంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలు అధిగమించగలిగితే ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించడం వలన మేలు జరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. వ్యాపారంలో పురోగతి మందగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో వ్యవహారాల్లో సహనం, ఓర్పు అవసరం. జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం వలన బంధాలు బలపడతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చక్కని ప్రణాళికతో, ముందుచూపుతో లాభాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ పెంచాలి. ఆర్థికంగా, కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ గత పెట్టుబడుల నుంచి లాభాలు ఉపశమనాన్ని అందించవచ్చు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రేమ బంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమతో కూడిన ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారంలో ధనయోగాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడంతో నిరాశ చెందుతారు. అధిక ఖర్చుల వలన ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రేమ వ్యహారాలు వివాహ బంధంతో బలపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram