Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు వివాహం నిశ్చ‌యం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు వివాహం నిశ్చ‌యం..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యక్తిగతంగా మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరి కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఆటు పోట్లు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల కన్నా సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ వారం అత్యంత ఫలదాయకంగా ఉంటుంది. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు అందుకుంటారు. జీవిత భాగస్వామికి ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ ఆదాయం పెరగడం ఆనందాన్ని ఇస్తుంది. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు సాఫీగా సాగిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కృషితో విజయాన్ని అందుకుంటారు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్థవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉన్నప్పటికినీ సహోద్యోగుల సహకారంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెంచాలి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత, చిత్తశుద్ధితో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఆర్థికంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారు స్థిరమైన ప్రయత్నంతో మంచి అవకాశాలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. వైవాహిక జీవితంలో అసూయ, అపార్థాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తొలగుతాయి.

కన్య (Virgo)

కన్యరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారులకు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఊహించని విధంగా సంపదలు కలిసి వస్తాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. లక్ష్మీ కటాక్షం ఉంది. అన్ని రంగాల వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. వ్యాపారులకు ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ, ఊహించని లాభాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగులు చాలా కాలంగా బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వారం చివరలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళను అవకాశాలుగా మలచుకొని ముందుకు దూసుకెళ్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను పొందుతారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. వారం మధ్యలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. కానీ మీ ప్రతిభతో వాటిని పరిష్కరిస్తారు. ఈ వారం ఆర్థికపరంగా శుభ ప్రయోజనాలను అందుకుంటారు. శత్రువుల నుంచి ఆపదలు ఎదురు కావచ్చు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారికి ఈ వారం కోరికలు నెరవేరవచ్చు. వస్త్రాభరణాల వ్యాపారులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా భూమి, భవనం లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయాలలో తొందరపాటు కూడదు. ఉద్యోగులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పుతో వేచి చూస్తే ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారు ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ వారం గొప్పగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభసమయం. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతులు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. మీడియా, జర్నలిజంలో పనిచేసే వ్యక్తులకు ఈ వారం అదృష్టంగా ఉంటుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలు సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని ధనలాభాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వ్యాపారులు వ్యాపారపరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు సజావుగా సాగి మంచి ఫలితాలను తెస్తాయి. వారం ద్వితీయార్థంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.