అక్టోబర్ 13 నుంచి 19 వరకు రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థికంగా గొప్ప శుభఫలితాలు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తిపరమైన ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్ధికంగా గొప్ప శుభఫలితాలను అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు సమకూరడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సంపదలు వృద్ధి చెందడంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా వ్యహరించాల్సిన సమయం. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అవసరం. వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలను సన్నిహితుల సహకారంతో అధిగమిస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కష్ట సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఓదార్పునిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. దేనికి భయపడకుండా ధైర్యంగా ఉంటే మంచిది. అడ్డంకులు, కఠినమైన పరిస్థితులలో మనోబలం కోల్పోకుండా ఉండడం అవసరం. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని విజయవంతంగా నడిపించడంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. వారం చివరలో కెరీర్లో దూసుకెళ్తారు. పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకా గ్రత, కష్టపడే తత్వంతో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు సహోద్యోగులు, ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తే విజయాలు సాధించవచ్చు. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు వారం చివరలో వ్యాపారంలో తీవ్రమైన సవాళ్లు, పోటీలను ఎదురుకోవాల్సి ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సింహం
సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబలో శుభకార్యాలు జరుగుతాయి. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఊహించని విధంగా సంపదలు కలిసి వస్తాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా పనిచేసి అన్ని పనులు సకాలంలో పూర్తి చేరారు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. ఆర్ధిక ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులు మీ నుంచి ఏమి ఆశిస్తున్నారో గ్రహించి నడుచుకుంటే మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు.
తుల
తులరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పోటీ తత్త్వం పెరుగుతుంది. స్వల్ప విజయాలు మాత్రమే ఉండవచ్చు. ఇతరులపై మీ సొంత అభిప్రాయాలను రుద్దడం మానుకోవాలి. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మకరం
మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, నిర్లక్ష్యం భారీ నష్టాలను కలిగిస్తుంది. గత తప్పిదాల కారణంగా వృత్తి వ్యాపారాలలో తీవ్ర నష్టాలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల సహకారంతో నష్ట నివారణ చర్యలు చేపడతారు. ఆర్ధిక పరంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిది. లేకుంటే ఎదురయ్యే నష్టాలు తట్టుకోవడం కష్టం. ఉద్యోగస్తులు కార్యాలయంలో పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, రుణవిముక్తికి అదనపు రాబడి కోసం ప్రయత్నాలు చేస్తారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ బలహీనతలు శత్రువులకు బలంగా మారే ప్రమాదముంది. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో డాకుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయండి. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మీనం
మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముందుగా ఈ రాశి వారు దేనికి తొందరపడకుండా ప్రశాంతంగా, ఏకా గ్రతతో ఉండటం ముఖ్యం. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటే లక్ష్యాలను సాధించడం సులభమవుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఓ శుభవార్త మీలో ఉత్తేజాన్ని నింపుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది.