సెప్టెంబ‌ర్ 1 నుంచి 7 వ‌ర‌కు రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు వివాహం నిశ్చ‌యం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

సెప్టెంబ‌ర్ 1 నుంచి 7 వ‌ర‌కు రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు వివాహం నిశ్చ‌యం..!

మేషం

మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి నూతన అవకాశాలు అందుకుంటారు. కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగుస్థులు మీ పని తీరుతో అందరిని మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. గణనీయమైన లాభాలు పొందవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలకమైన పురోగతి ఉంటుంది. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత పదవులను చేపడతారు. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్సులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం

మిథున రాశి వారికి ఈ వారం ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వైవాహిక జీవితం కొత్త ఆనందాన్ని ఇస్తుంది. ఇదివరకు మీ మధ్య ఉన్న అపార్ధాలు కూడా తొలగిపోతాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనువైన సమయం నడుస్తోంది. వ్యాపారం ప్రోత్సాహకారంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వాయిదా పడిన ప్రణాళికలు ఆకస్మికంగా ముందుకు సాగుతాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన విజయాలు పొందాలంటే సోమరితనాన్ని అధిగమించాలి. కష్టపడితే తప్ప విజయాలు రావన్న సంగతి గుర్తించాలి. ఉద్యోగులు అంది వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా అప్రమత్తంగా ఉండాలి.

సింహం

సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు వారం ప్రారంభంలో కొత్త బాధ్యతలు చేపడతారు. కొంత కఠిన శ్రమతోనే బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. స్థానచలనం సూచన ఉంది. వ్యాపారులకు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు జరిగే అవకాశాలున్నాయి. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కన్య

కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పలుకుబడి, పరపతి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో వ్యవహరిస్తే మంచిది. బంధు మిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు.

తుల

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో పోటీని అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. చేపట్టిన వృత్తిలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు స్దాన చలనం సూచన ఉంది. ప్రమోషన్లు అందుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, అవివాహితులకు కళ్యాణయోగం ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులు చేపట్టిన నూతన బాధ్యతలను తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ధనం సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

మకరం

మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో విహార యాత్రలకు వెళ్తారు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఆశించిన లాభాలు అందించక పోవచ్చు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంది. గత కొంతకాలంగా వేధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కెరీర్​లో దూసుకెళ్తారు. వ్యాపారంలో లాభాల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్థులు చేపట్టిన నూతన బాధ్యతలను తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్​కు అవకాశం ఉంది. ఇంటి అలంకరణ కోసం ధనవ్యయం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం.

మీనం

మీనరాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. ఉద్యోగులు వారం ప్రారంభంలో ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మంచి అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.