AP DME Jobs 2026 | నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్!

AP DME Jobs 2026 | ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 284 సీనియర్ రెసిడెంట్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

AP DME Jobs 2026 | ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (DME) ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల దరఖాస్తుకు నేటి (మార్చి 29)తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలోని మొత్తం 22 విభాగాల్లో 284 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 25వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో MD/MS/DNB ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

వయోపరిమితి

* క్లినికల్ విభాగాలకు గరిష్ఠంగా 44 ఏళ్లు
* నాన్ క్లినికల్ విభాగాలకు గరిష్ఠంగా 49 ఏళ్లు

దరఖాస్తు రుసుము – ఎంపిక

అర్హులైన అభ్యర్థులు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులు రూ.2వేలు, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.వెయ్యి దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పీజీ మెరిట్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్థానిక అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.80,500 వరకు జీతం ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

అనాటమీ – 29
ఫిజియాలజీ – 22
బయోకెమిస్ట్రీ – 33
ఫార్మకాలజీ – 28
పాథాలజీ – 32
మైక్రోబయాలజీ – 30
ఫోరెన్సిక్ మెడిసిన్ – 18
కమ్యూనిటీ మెడిసిన్ – 24
పీడియాట్రిక్స్ – 2
డీవీఎల్ – 1
సైకియాట్రీ – 1
జనరల్ సర్జరీ – 4
ఆర్థోపెడిక్స్ – 2
ఈఎన్‌టీ – 1
ఆప్తమాలజీ – 1
ఓబీజీ – 2
అనెస్తిషియాలజీ – 3
రేడియో డయాగ్నోసిస్ – 4
ఎమర్జెన్సీ మెడిసిన్ – 34
రేడియేషన్ అంకాలజీ – 9

ఈ పోస్టులకు ఇవాల్టితో గడువు ముగియనుండటంతో అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More :

వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!

Tomcom | టామ్‌కమ్ ద్వారా ఒమన్‌లో భారీ జాబ్స్.. నెలకు 22 లక్షల జీతం

Latest News