Bank Jobs Notifications | బ్యాంకుల్లో కొలువుల జాతర .. 4640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
Bank Jobs Notifications | మీరు బ్యాంకు( Bank )లో ఉద్యోగం( Job ) చేయాలనుకుంటున్నారా..? అలాంటి వారికి ఇదొక గొప్ప సువర్ణావకాశం.. డిగ్రీ( Degree ) అర్హతతో ఆయా బ్యాంకుల్లో ఉద్యోగాల( Bank Jobs ) భర్తీకి నోటిఫికేషన్లు( Notifications ) విడుదలయ్యాయి. పది, ఇరవై పోస్టులు కాదు ఏకంగా 4640 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

Bank Jobs Notifications | మీరు డిగ్రీ( Degree ) పాసయ్యారా..? బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్ల( Bank Jobs Notifications ) కోసం ఎదురు చూస్తున్నారా..? ఇంకేందుకు ఆలస్యం మరి.. దేశంలోని ఆయా బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. యూనియన్ బ్యాంక్( Union Bank ), ఐడీబీఐ( IDBI ), ఎస్‌బీఐ( SBI ), బ్యాంక్ ఆఫ్ బరోడా( Bank of Baroda ) బ్యాంకుల్లో 4640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరి ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు ఏంటి..? పరీక్ష విధానం ఎలా ఉంటుంది..? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు..? అనే విషయాలను తెలుసుకుందాం..
ఎస్‌బీఐ ( SBI )
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI )లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 2964
వీటిలో 2600 ఖాళీలతోపాటు బ్యాక్‌లాగ్ 364 ఖాళీలు ఉన్నాయి.
తెలంగాణలో– 233, ఏపీలో-186 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 29
వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers/current-opening
యూనియన్ బ్యాంక్ ( Union Bank )
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Union Bank of India )లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 500
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్)-250, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-50
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, సీఏ, సీఎస్, ఎమ్మెస్సీ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 20
వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in
బ్యాంక్ ఆఫ్ బరోడా ( Bank of Baroda )
బ్యాంక్ ఆఫ్ బరోడా ( Bank of Baroda ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 500
పోస్టులు: ఆఫీస్ అసిస్టెంట్
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి
ఎంపిక: రాతపరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 23
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
ఐడీబీఐ ( IDBI )
దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్( IDBI Bank ) లిమిటెడ్ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 676
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఎంఎం- గ్రేడ్ ఓ)
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 20
వెబ్‌సైట్: https://www.idbibank.in