BHEL | బీహెచ్ఈఎల్‌లో కొలువుల జాతర.. ఐటీఐ అర్హతతో 515 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
BHEL | మీరు ఐటీఐ( ITI ) పూర్తి చేశారా..? ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) కోసం ఎదురుచూస్తున్నారా..? మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ కోసం 515 పోస్టులను భర్తీ చేసేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్( Bharat Heavy Electricals Limited ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను దేశ వ్యాప్తంగా ఉన్న బీహెచ్ఈఎల్( BHEL ) యూనిట్లలో భర్తీ చేయనున్నారు.

BHEL | భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్( Bharat Heavy Electricals Limited ) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ( ITI ) అర్హతతో 515 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఉన్న బీహెచ్ఈఎల్( BHEL ) యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల వివరాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ వంటి వివరాలను తెలుసుకుందాం..
ఖాళీలు ఇలా..
ఫిట్టర్ – 176
వెల్డర్ – 97
టర్నర్ – 51
మెషినిస్ట్ – 104
ఎలక్ట్రిషియన్ – 65
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 18
ఫౌండ్రీమెన్ – 4
ఈ పోస్టులను రాణిపేట్, విశాఖపట్నం, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్, జగదీశ్‌పూర్, హరిద్వార్, భోపాల్, ఝాన్సీ, తిరుచిరాపల్లి యూనిట్లలో భర్తీ చేయనున్నారు.
అర్హతలు
పదో తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం ఉత్తీర్ణత సరిపోతుంది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమెన్ ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, ఐటీఐ, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
వయసు
2025 జులై 1వ తేదీ నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్‌లకు 27 ఏండ్లకు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేను ఏండ్లు, ఉద్యోగానుభవం ఉన్నవారికి ఏడేండ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులకు రూ. 1072
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు రూ. 472
వేతన శ్రేణి
నెలకు రూ. 29,500 నుంచి 65 వేల వరకు. తాత్కాలిక ఉద్యోగులుగా ఏడాదిపాటు కనీస వేతనంతో పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్టిసన్ గ్రేడ్-4గా శాశ్వతంగా నియమిస్తారు.
ఎంపిక ఇలా..
ఈ నియామకాలు రెండు దశల్లో జరగనున్నాయి. స్టేజ్-1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టేజ్-2లో స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో జనరల్ అభ్యర్థులు 30, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 22.5 మార్కులు సాధించాలి. స్కిల్ టెస్ట్ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో సాధించిన స్కోర్ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 2025 ఆగస్టు 12
వెబ్‌సైట్ : https://careers.bhel.in/index.jsp