ITI Admissions | ITI కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్ విడుదల.. చివ‌రి తేదీ జూన్ 21.. ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..

ITI Admissions | ఇంజినీరింగ్( Engineering ), నాన్ ఇంజినీరింగ్( Non Engineering ) కోర్సులు చేయాల‌నుకునే విద్యార్థుల‌కు గొప్ప సువ‌ర్ణ అవ‌కాశం. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఐటీఐ కాలేజీల్లో( ITI Colleges ) 2025 - 26 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ఇంజినీరింగ్( Engineering ), నాన్ ఇంజినీరింగ్( Non Engineering ) కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఐటీఐ నోటిఫికేష‌న్( ITI Notification ) విడుద‌లైంది. ఎనిమిది లేదా ప‌దో త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఐటీఐ కోర్సుల్లో( ITI Courses ) చేరేందుకు కావాల్సిన అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం త‌దిత‌ర వివ‌రాల గురించి తెలుసుకుందాం..

ITI Admissions | ITI కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్ విడుదల.. చివ‌రి తేదీ జూన్ 21.. ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..

ITI Admissions | ఐటీఐ (ITI)లో చేరితే తక్కువ సమయంలో ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. పాలిటెక్నిక్‌( Polytechnic ), వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి వచ్చినా ఐటీఐకి ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు. గత కొన్నేండ్లుగా ఐటీఐలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఐటీఐ పూర్తయిన తర్వాత నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా రెండో సంవత్సరంలో చేరే అవకాశం కూడా ఉంది. ఐటీఐ పాసైతే వివిధ సంస్థల్లో, పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందే వీలు ఉంటుంది.ఈ కారణంగా ఐటీఐ చదివేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంట‌ర్లు(ATC), ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఐటీఐ కాలేజీల్లో( ITI Colleges ) ఇంజినీరింగ్( Engineering ), నాన్ ఇంజినీరింగ్(  Non Engineering ) కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ఐటీఐ నోటిఫికేష‌న్( ITi Notification ) విడుద‌లైంది. ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు ఎనిమిది లేదా ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి.

వ‌య‌సు( Age Limit )

ఐటీఐ కోర్సుల్లో చేరాల‌నుకునే వారికి ఈ ఏడాది ఆగ‌స్టు 1వ తేదీ నాటికి 14 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. డ్రోన్ టెక్నీషియ‌న్ కోర్సుకు 16 ఏండ్లు త‌ప్పనిస‌రిగా ఉండాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ : జూన్ 21, 2025. ద‌ర‌ఖాస్తులో ఆన్‌లైన్‌లోనే స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు కావాల్సినవి ఇవే..

విద్యార్థి మొబైల్ నంబ‌ర్, ఈ మెయిల్, ఆధార్ నంబ‌ర్, 10వ / 8వ తరగతి మెమో, కమ్యూనిటీ, స్టడీ మరియు ఇతర సర్టిఫికెట్లు, తాజా ఫోటో, సంతకం (స్కాన్ చేయబనవి).

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..( How to Apply )

మొద‌ట‌గా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. రిజిస్ట్రేష‌న్ చేసుకునే స‌మ‌యంలో విద్యార్థి పేరు, త‌ల్లిదండ్రులు పేర్లు, జెండ‌ర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబ‌ర్, ఈమెయిల్ ఐడీ న‌మోదు చేయాలి. అనంత‌రం లాగిన్ ఐడీ, పాస్ వ‌ర్డ్ క్రియేట్ అవుతుంది. ఆ త‌ర్వాత ద‌ర‌ఖాస్తున‌కు లాగిన్ అవ్వాలి.

ద‌ర‌ఖాస్తులో కులం, స్థానిక‌త‌, పీహెచ్‌సీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత తాజా ఫొటో, సంత‌కం అప్‌లోడ్ చేయాలి. అనంత‌రం స్ట‌డీ స‌ర్టిఫికెట్స్.. టెన్త్ మెమో, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, బ‌ర్త్ స‌ర్టిఫికెట్, బోన‌ఫైడ్ స‌ర్టిఫికెట్, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం అప్‌లోడ్ చేయాలి.

ఫీజుల వివ‌రాలు( Fee Details )

ఇంజినీరింగ్ కోర్సులు( Engineering Courses )

అర్బ‌న్ ఏరియాలో రూ. 16,500(ఏడాదికి)
రూర‌ల్ ఏరియాలో రూ. 15,000(ఏడాదికి)

నాన్ ఇంజినీరింగ్ కోర్సులు ( Non Engineering Courses )

అర్బ‌న్ ఏరియాలో రూ. 13,200(ఏడాదికి)
రూర‌ల్ ఏరియాలో రూ. 12,000(ఏడాదికి)

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుతో పాటు త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.. https://iti.telangana.gov.in/