తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్

తెలంగాణలో 2026-27 డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. మూడు దశల్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ షెడ్యూల్ ప్రకటించారు.

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్

విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ బాలకృష్ణారెడ్డి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం మూడు ఫేజ్‌ల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఫస్ట్ ఫేజ్‌ వెబ్ ఆప్షన్స్
మే 14న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్, ఫస్ట్ ఫేజ్ ఆన్‌లైన్‌ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23 వరకు కొనసాగుతుంది.

సెకండ్ ఫేజ్‌ రిజిస్ట్రేషన్ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌ వెబ్ ఆప్షన్స్ మే 15 నుంచి మే 26 వరకు, సెకండ్ ఫేజ్‌ సీట్ అలాట్మెంట్ 30న, సెకండ్‌ ఫేజ్ ఆన్‌లైన్‌ సెల్ఫ్ రిపోర్టింగ్.. మే 31 నుంచి జూన్ 5 వరకు కొనసాగనుంది.

థర్డ్ ఫేజ్‌ రిజిస్ట్రేషన్ మే 31 నుంచి జూన్ 15 వరకు కొనసాగనుంది. థర్డ్ ఫేజ్‌ వెబ్ ఆప్షన్లు.. మే 31 నుంచి జూన్ 16 వరకు ఉంటుంది. థర్డ్ ఫేజ్‌ సీట్ అలాట్మెంట్ జూన్ 20న, ఆన్‌లైన్‌ రిపోర్టింగ్.. జూన్ 20 నుంచి జూన్ 25 వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి :

మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!
కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ