డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
  • మూడు దఫాలుగా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ
  • ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 6 నుంచి మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. రూ.200 రుసుంతో ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. మే 15 నుంచి మే 27 వరకు ‘దోస్త్’ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 3న ‘దోస్త్’ మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జూన్ 4 నుంచి 10 లోపు ‘దోస్త్’ సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు. జూన్ 4 నుంచి జూన్ 13 వరకు ‘దోస్త్’ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.

రూ.400 రుసుంతో ‘దోస్త్’ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. జూన్ 4 నుంచి జూన్ 14 వరకు దోస్త్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. జూన్ 18న దోస్త్ రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు. జూన్ 19 నుంచి 24 వరకు ‘దోస్త్’ సెల్ఫ్ రిపోర్ట్ కు అవకాశం కల్పించారు. జూన్ 19 నుంచి 25 వరకు ‘దోస్త్’ మూడో దశ రిజిస్ట్రేషన్ చేపట్టనున్నారు. రూ.400 రుసుంతో ‘దోస్త్’ మూడో ఫేజ్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. జూన్ 19 నుంచి 25 వరకు దోస్త్ మూడో దశ వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. జూన్ 29న దోస్త్ మూడో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు.