Auto Driver Hangama| ఒక్క బీరు ఎంతపని చేసిందిరో…ఆటో అద్దానికి తల బాదుకున్న డ్రైవర్

Auto Driver Hangama| ఒక్క బీరు ఎంతపని చేసిందిరో…ఆటో అద్దానికి తల బాదుకున్న డ్రైవర్

విధాత: డ్రంక్ ఆండ్ డ్రైవ్ లో దొరికిపోయే మందుబాబులు చేసే వింత చేష్టల హంగామా అంతా ఇంత ఉండదు..కొందరి చేష్టలు కామెడీగా ఉంటే..మరికొందరివి వయలెన్స్ గా ఉంటాయి. అయితే చాంద్రాయణగుట్టలో డ్రంక్ ఆండ్ డ్రైవ్ టెస్టులో దొరికిపోయిన ఓ ఆటో డ్రైవర్ చేసిన హంగామా వీడియో వైరల్ గా మారింది. డ్రంక్ ఆండ్ డ్రైవ్ డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో 200 పాయింట్లు వచ్చింది. ఇంకేముంది మనోడి మత్తు దిగేలా కేసు నమోదు చేసి..రిమాండ్ తరలించే పనిలో పడ్డారు పోలీసులు. అది చూసిన ఆటో డ్రైవర్ వోలమ్మోలమ్మో…నేను కేవలం ఒక్క బీరు తాగానని..దానికే 200పాయింట్ల వస్తదా..అంటూ తల..గుండెలు బాదుకుంటూ..తన ఆటో అద్దాలకు తల బాదుకుంటూ నానా హంగామా చేశాడు.

ఒక్కటంటే..ఒక్క బీరే సార్ అంటూ అచ్చం సినిమాల్లో తాగుబోతు కమెడీయిన్ల తరహాలో చేసిన ఆటో డ్రైవర్ హంగామా పోలీసులకు సైతం నవ్వు తెప్పించింది. ఆగరా బాబు ఆటోకు ఎందుకు తల బాదుకుంటావంటూ అతడిని పట్టుకుని ఆపి సముదాయించి వివరాలు నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్ రావాలంటూ ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.