Chennai | రోడ్డుపై బర్త్‌డే వేడుకలు.. తప్పుకోమన్నందుకు ఆటో డ్రైవర్ హత్య
Chennai విధాత: రోడ్డుపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నపుడు హార్న్ కొట్టిన ఆటోడ్రైవర్‌ను మట్టుబెట్టిన ఘటన చెన్నై (Chennai) లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కామేష్ అనే 25 ఏళ్ల యువకుడు నగరంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అతడి సోదరుడు సతీశ్‌తో కలిసి ఒరగడం వెళుతుండగా అయ్యప్పన్ వీధి రోడ్డుపైకి వచ్చేసరికి.. రోడ్డుపై కొంతమంది గుమిగూడి పుట్టినరోజు కేక్‌ను కట్ చేస్తున్నారు. ఆటోలో ఉన్న కామేష్.. చాలా సేపు వారిని తప్పుకోవాలని […]

Chennai
విధాత: రోడ్డుపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నపుడు హార్న్ కొట్టిన ఆటోడ్రైవర్‌ను మట్టుబెట్టిన ఘటన చెన్నై (Chennai) లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కామేష్ అనే 25 ఏళ్ల యువకుడు నగరంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అతడి సోదరుడు సతీశ్‌తో కలిసి ఒరగడం వెళుతుండగా అయ్యప్పన్ వీధి రోడ్డుపైకి వచ్చేసరికి.. రోడ్డుపై కొంతమంది గుమిగూడి పుట్టినరోజు కేక్‌ను కట్ చేస్తున్నారు.
ఆటోలో ఉన్న కామేష్.. చాలా సేపు వారిని తప్పుకోవాలని హార్న్ కొట్టాడు. దీంతో కేక్ వేడుకల్లో ఉన్న 10 మంది ఆటో వద్దకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. తమ వేడుక అయిపోయే వరకు వేచి ఉండాల్సిందేనని తెగేసి చెప్పారు. దీంతో కామేష్ వారి దగ్గరకు వెళ్లి రోడ్డును ఖాళీ చేయాలని, ట్రాఫిక్ పెరిగిపోయిందని అభ్యర్థించాడు.
దీంతో పుట్టినరోజు జరుపుకొంటున్న గౌతమ్ అనే యువకుడు మరో ఏడుగురు చాకులు, కత్తులతో బాధితుడ్ని పొడవటం ప్రారంభించారు. అక్కడే ఉన్న సతీశ్ ఈ ఘోరాన్ని ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల వారు వచ్చేటప్పటికే నిందితులు కామేశ్‌ను కసితీరా పొడిచి పరారయ్యారు.
కాగా.. ఉదయం లేచి చూసే సరికి ఈ హత్యను చూసి స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. రోడ్డుపై పుట్టినరోజు వేడుకలను పోలీసులు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యకు సంబంధించి గౌతమ్ (22), నవీన్ కుమార్ (18), అజయ్ (22), రియాజ్ (19), కతిరేసేన్ (19), సూర్య (23), ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు.