తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు మే 4 వరకు పొడిగించారు. లేట్ ఫీజు రూ.3వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్‌, ఫెయిలైన విద్యార్థులు నాలుగో తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆలస్య రుసుము రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలు మే 13, 2026 నుండి రెండు సెషన్లలో ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22, 2026 నుండి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు, అలాగే తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే (ఇంప్రూవ్‌మెంట్) వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి :

Firefighters | మంటలు ఆర్పడమే కాదు.. 73 శాతం వేరే పనులు కూడా.. అగ్నిమాపక సిబ్బంది అసలైన బాధ్యతలివే!
Emergency Alert | ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్‌లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!