TET exams | తెలంగాణో ఇవాళ్టి నుంచి టెట్ పరీక్షలు.. 15 నిమిషాలు ముందే గేట్లు బంద్..
TET exams | రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (TET exams) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఇవాళ్టి నుంచి (సోమవారం) జూన్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.

TET exams : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (TET exams) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఇవాళ్టి నుంచి (సోమవారం) జూన్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను టెట్ కన్వీనర్ వెల్లడించారు. పరీక్షలకు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా, టెట్ పరీక్షలను తొలిసారి కంప్యూటర్ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
టెట్‌కు పరీక్షల వచ్చే అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ నేపథ్యంలో పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి అభ్యర్థులు అంతకంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.