• Telugu News
  • /Edu career

TG TET | నేడే లాస్ట్ డేట్.. ముగియనున్న టెట్ దరఖాస్తు ప్రక్రియ

తెలింగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కి దరఖాస్తు ప్రక్రియ నేటి(శనివారం)తో ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 1.98 లక్షల అప్లీకేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Reported by: chinna | విద్య - ఉద్యోగం | Nov 29, 2025, 3:58 pm IST
Read Time: 4 mins
TG TET | నేడే లాస్ట్ డేట్.. ముగియనున్న టెట్ దరఖాస్తు ప్రక్రియ

విధాత, హైదరాబాద్ : తెలింగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కి దరఖాస్తు ప్రక్రియ నేటి(శనివారం)తో ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 1.98 లక్షల అప్లీకేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతోపాటు.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి కూడా టెట్ తప్పనిసరి చేయడంతో ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు కూడా టెట్-2026కి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 20వేల మంది వరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నట్టు సమాచారం టెట్-2026కి దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులో తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి డిసెంబర్ 1 వరకు ఎడిట్ సౌకర్యానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం.

టెట్-2026 నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు(నవంబర్14) నుంచే దరఖాస్తులను ఆన్‌లైన్లో స్వీకరిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు ప్రకటించగా.. శుక్రవారం సాయంత్రం వరకు సుమారు 1.98 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్(TET) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇన్సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులను ఈ నెల 29 వరకు స్వీకరించనున్నారు. టెట్– 2026 పరీక్షలను జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.

ఒక్కో పేపర్‌కి ఫీజు రూ. 750గా నిర్ణయించగా.. రెండు పేపర్లు రాయాలనుకునే వారు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. టెట్-2026 ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలతోపాటు ఇతర ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే 7093708883/ 7093708884/7093958881/7093468882/7032901383/9000756178 హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. అయితే, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. డిసెంబరు 1 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో సుప్రీంకోర్టు తీర్పుపై చట్టసవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.