Telangana Tet Results| తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయి

Telangana Tet Results| తెలంగాణలో టెట్ ఫలితాల (Telangana Tet Results)ను రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) మంగళవారం విడుదల(Released) చేసింది. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి(Education Secretary) యోగితా రాణా(Yogita Rana) ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 90,205 మంది పరీక్షలు రాస్తే, 30,649 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్ లో ఈ పరీక్షలు రాశారు. ఏడు భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరిగాయి.టెట్ పరీక్షల ఫలితాల కోసం టీజీటెట్.ఏపీఆన్‌లైన్.ఇన్/టీజీటెట్/రిజల్ట్స్ ఫ్రంట్ వెబ్ సైట్ చూడాలి.వెబ్ సైట్ లో ముందుగా హల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత పేపర్ ను ఎంచుకోవాలి. పుట్టిన తేదిని ఎంటర్ చేయాలి… ఆ తర్వాత ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.
ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీలో భాగంగా 2024 డిసెంబర్ లో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ ఏడాది జూన్ లో మరోసారి టెట్ నిర్వహించారు. టెట్ లో క్వాలిఫై అయితే డీఎస్పీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది.