TS TET | రేపు టీఎస్ టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

TS TET | రేపు టీఎస్ టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

TS TET | ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష(టెట్‌) ఫ‌లితాలు ఈ నెల 27న విడుద‌ల కానున్నాయి. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. టెట్ ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, ఉన్న‌తాధికారులు తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఎస్ఈఆర్‌టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. పేప‌ర్‌-1కు 2.26 ల‌క్ష‌లు, పేప‌ర్‌-2కు 1.90 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యారు. ప్ర‌తిసారి కఠినంగా ఉండే పేపర్‌-1 ఈసారి సులభంగా రావడంతో ఇందులో ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉన్నది. పేపర్‌-2 కాస్త కఠినంగా రావడంతో ఇది ఉత్తీర్ణతపై ప్రభావం చూపవచ్చు స‌బ్జెక్టు నిపుణులు భావిస్తున్నారు.