TET Exam | కొనసాగుతున్న టెట్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్‌లైన్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

విధాత: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్‌లైన్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరగనున్నాయి. రెండు పేపర్లకు కలిపి 2, 86, 386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్షకేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్ విధించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.