AP DSC : ఏపీలో డీఎస్సీకి లైన్ క్లియ‌ర్.. సుప్రీం అనుమ‌తి

AP DSC :  ఏపీలో డీఎస్సీకి లైన్ క్లియ‌ర్.. సుప్రీం అనుమ‌తి

AP DSC : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో డీఎస్సీకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటూ ప‌లువురు అభ్య‌ర్థులు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఓ వైపు ప‌రీక్ష‌ల‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న‌ప్ప‌టికీ.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ల నేప‌థ్యంలో డీఎస్సీ పరీక్ష‌ల‌పై సందిగ్ధ‌త నెల‌కొన్న‌ది. కాగా తాజాగా సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన పిటిష‌న్లు కొట్టేయ‌డంతో డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది.

టెట్, డీఎస్సీ ర‌ద్దు చేయాలంటూ ఆరుగురు అభ్య‌ర్థులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ల‌ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. అభ్య‌ర్థుల‌కు ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే ఉంటే.. హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

దీంతో, ఏపీలో టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగనుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20వ తేదీన నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.