TG TET 2024-II | టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారికి దరఖాస్తు ఉచితం..!
TG TET 2024-II | టెట్( TET ) అభ్యర్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. మొన్న మే నెలలో టెట్ రాసి అర్హత సాధించని వారు, ఒకవేళ సాధించినా స్కోర్ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాసేవారికి ఎటువంటి ఫీజు ఉండదు.

TG TET 2024-II | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు గురువారం రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమైంది. సాంకేతిక సమస్యల కారణంగా 5వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల ప్రక్రియ రెండు రోజులు ఆలస్యమైంది. సాంకేతిక సమస్య పరిష్కారం అనంతరం గురువారం రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌తో పాటు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో అర్హత గల అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇక టెట్( TET ) అభ్యర్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. మొన్న మే నెలలో టెట్ రాసి అర్హత సాధించని వారు, ఒకవేళ సాధించినా స్కోర్ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాసేవారికి ఎటువంటి ఫీజు ఉండదు. మే నెలలో టెట్ రాసినా మళ్లీ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరిలో జరగబోయే టెట్ పరీక్షలకు హాజరు కావొచ్చు. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటించనున్నారు.
టెట్ ఫీజులు ఇలా..
టెట్ పరీక్ష ఫీజును ఈసారి తగ్గించారు. గతంలో ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2 వేలుగా వసూలు చేశారు. కానీ ఈసారి ఆ ఫీజును కాస్త తగ్గించారు. ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు రూ. 1000గా నిర్ణయించారు.