TG TET | డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. 2, 3 రోజుల్లో ‘టెట్’ నోటిఫికేషన్
TG TET | రాష్ట్రంలో డీఎస్సీకి ప్రిపేరవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రెండు, మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.
TG TET | రాష్ట్రంలో డీఎస్సీకి ప్రిపేరవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రెండు, మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. టీచర్ ఎలిజబిలిటీ పరీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందుకు అర్హత సాధించినట్టు. లేదంటే డీఎస్సీ రాతపరీక్ష రాసేందుకు వీల్లేదు.
విద్యాశాఖ నిబంధనల ప్రకారం.. టెట్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలి. 2026లో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. ఈ క్రమంలో టెట్-2026 నిర్వహణకు ఇటీవలే పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపంగా పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అనుమతి ఇచ్చారు. దీంతో రెండు, మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.
జనవరిలో నిర్వహించిన టెట్-2025 రెండో విడత పరీక్షకు 1.95 లక్షల మంది హాజరైన సంగతి తెలిసిందే. అయితే టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి కొన్ని వేలమంది నాడు దరఖాస్తు చేయలేదు. ఈసారి టెట్ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram