సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌.. అల్లు అర్జున్‌ కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దూరంగా ఉండాలని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. నచ్చని వారిపై సమయం వృథా చేయకుండా సొంత ఎదుగుదలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ పై ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. నచ్చని వాళ్ల గురించి ట్రోల్స్ చేస్తూ..వాళ్ల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్టు చేయకుండా, నచ్చే పని చేసుకుంటూ వెళ్లిపోవడం మంచిదని అభిమానులకు సూచించారు. హైదరాబాద్‌లో అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయ్. వాళ్లను హేట్ చేయడం, ట్రోల్ చేయడం లాంటివి చేయొద్దు అని సూచించారు.

ఒకరిపై విమర్శలు చేయడం ఎప్పుడూ సరికాదు అని, నచ్చని వాళ్ల కోసం డబ్బు ఖర్చు పెడతామా? అలాగే, నచ్చని వాళ్ల కోసం మన సమయం ఎందుకు ఖర్చు చేయాలి? ఆ సమయాన్ని సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండని… ఎవరినీ ట్రోల్స్ చేయకండి అని అర్జున్ సూచించారు. నా ఫ్రెండ్ వాసు తన పేరుకు ముందు బన్నీ అని పెట్టుకున్నాడు.. ఎవరైనా అలా పెట్టుకుంటారా అని కామెంట్ చేశారు. ఇఫ్పుడు పెట్టుకుంటే మాత్రం.. “V-A-S-U” కాకుండా స్టైలిష్‌గా “V-A-A-S-U” అని పెట్టుకోమని సూచిస్తానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప’ తర్వాత మరోసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో బన్నీ కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో ఇతర కీలక హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. అలాగే రష్మిక మందన్న నెగెటివ్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

రాకా సినిమా తర్వాతా అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న AA23 వర్కింగ్ టైటిల్ తో కూడిన మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్ లేకుండా పూర్తిగా కథ, యాక్షన్, ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందన్న సమాచారం బన్నీ అభిమానులలో మరింత ఆసక్తి రేపుతుంది.

Latest News