చిరంజీవి ఇంటి దగ్గరలోనే.. అల్లు అర్జున్ భారీ నివాస భవనం !
జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ఇంటి సమీపంలో అల్లు అర్జున్ రూ.80 కోట్ల విలువైన భారీ విలాసవంతమైన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారన్న వార్త వైరల్ అయింది.
విధాత ,హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో భారీ విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సమీపంలో ఒక విలాసవంతమైన ఇంటిని అల్లు అర్జున్ నిర్మిస్తున్నారు.
సుమారు 4,000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఇంటి విలువ రూ.80 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఏడాది చివరికల్లా అల్లు అర్జున్ గృహప్రవేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
పుష్ప 2 సినిమాతో నేషనల్ స్టార్ గా ఎదిగిపోయిన అల్లు అర్జున్ వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీలో దూసుకపోతున్నారు. “పుష్ప” ఇచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ను మరింత పెంచుకునేలా బన్నీ పక్కా ప్లానింగ్‌తో సాగిపోతున్నాడు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తన స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌తో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నారు. 2027లో వచ్చే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే, ‘దేవర’ ఫేమ్ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి నలుగురు అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతమంది స్టార్ నటీనటులు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. అయితే రాకా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు బన్నీ సిద్ధమవుతున్నారు. ఆ తర్వాతా డైరక్టర్ ప్రశాంత్ నీల్- బన్నీ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా సినిమా కూడా ఉంటుందన్న వార్తలు వెలువడున్నాయి.
ఇవి కూడా చదవండి :
శంషాబాద్ లో రూ.90కోట్ల విలువైన 9ఎకరాలను కాపాడిన హైడ్రా
OTT Movies | ఐపీఎల్ ఎఫెక్ట్: థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే… ఓటీటీలో మాత్రం కంటెంట్ జోరు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram