OTT Movies | ఐపీఎల్ ఎఫెక్ట్: థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే… ఓటీటీలో మాత్రం కంటెంట్ జోరు!

OTT Movies | క్రికెట్ పండుగ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మంచి జోరుగా సాగుతూ ఉండటంతో ఈ వారం కూడా థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. భారీ చిత్రాలు రిలీజ్‌కు దూరంగా ఉండగా… చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. దీంతో సినిమా ప్రియులకు థియేటర్ల పరంగా కొంత నిరాశే ఎదురవుతోంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 22, 2026 9:57 AM IST
OTT Movies | ఐపీఎల్ ఎఫెక్ట్: థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే… ఓటీటీలో మాత్రం కంటెంట్ జోరు!

OTT Movies | క్రికెట్ పండుగ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మంచి జోరుగా సాగుతూ ఉండటంతో ఈ వారం కూడా థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. భారీ చిత్రాలు రిలీజ్‌కు దూరంగా ఉండగా… చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. దీంతో సినిమా ప్రియులకు థియేటర్ల పరంగా కొంత నిరాశే ఎదురవుతోంది.

అయితే మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం వినోదాన్ని తగ్గించలేదు. యాక్షన్, థ్రిల్లర్, హారర్ నుంచి రియాలిటీ షోలు వరకు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి.

థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాలు

ఈ వారం థియేటర్లలోకి రాబోయే సినిమాలు అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే. అయినప్పటికీ కథ, కంటెంట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

వాలా 2 – ఏప్రిల్ 24
గేదెల రాజు – ఏప్రిల్ 24
పరమపద సోపానం – ఏప్రిల్ 24

ఓటీటీలో సందడి – ప్లాట్‌ఫామ్ వారీగా

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ వారం ప్రైమ్ వీడియోలో పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.

ఫ్రమ్ 4 (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 19
కెవిన్ (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 20
కిల్లింగ్ గ్రౌండ్స్: ది గిల్గో బీచ్ మర్డర్స్ – ఏప్రిల్ 22
హ్యాపీ రాజ్ (తమిళం/తెలుగు మూవీ) – ఏప్రిల్ 24
నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 24

నెట్‌ఫ్లిక్స్..

నెట్‌ఫ్లిక్స్ ఈ వారం పాపులర్ షోలు, సినిమాలతో ముందుకొస్తోంది.

రెసిల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) – ఏప్రిల్ 19
అన్‌చార్టెడ్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ) – ఏప్రిల్ 21
హల్క్ హోగన్: రియల్ అమెరికన్ – ఏప్రిల్ 22
స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 23
అపెక్స్: హంట్ ఆర్ బి హంటెడ్ – ఏప్రిల్ 24

జీ5

బ్యాండ్ మేళం – ఏప్రిల్ 24

జియో హాట్ స్టార్

24 (హిందీ సిరీస్) – ఏప్రిల్ 24
ప్రతి ఛాయ – ఏప్రిల్ 24

థియేటర్లకు బదులు ఓటీటీకి డిమాండ్

ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులను టీవీలకు పరిమితం చేస్తుండటంతో… థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితిని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నాయి. కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఇంటి వద్దే ఎంటర్‌టైన్ చేయడానికి పోటీ పడుతున్నాయి.

మొత్తానికి ఈ వారం థియేటర్లలో పెద్దగా హడావిడి లేకపోయినా… ఓటీటీలో మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. కాబట్టి ఇంట్లోనే కూర్చొని సినిమాలు, సిరీస్‌లను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.