Dharma Mahesh | కొత్త బిజినెస్‌లో ఆ హీరో సెన్సేషన్ .. పేరు ఆ లెటర్‌తో మొదలైతే చికెన్ మండీ ఫ్రీ
Dharma Mahesh | టాలీవుడ్‌లో సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన ధర్మ మహేష్, ప్రస్తుతం తన ఫుడ్ బిజినెస్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.
Dharma Mahesh | టాలీవుడ్‌లో సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన ధర్మ మహేష్, ప్రస్తుతం తన ఫుడ్ బిజినెస్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భార్యతో జరిగిన వివాదంతో వైరల్ అయిన మహేష్, ఇప్పుడు మరోసారి చర్చకు కారణమవుతున్నాడు . అయితే ఈసారి ఒక పాజిటివ్ బిజినెస్ ట్విస్ట్‌తో.
‘Gismat’ నుంచి ‘Jismat’ — కుమారుడి ప్రేమతో పేరుమార్పు
ధర్మ మహేష్ ఎన్నాళ్లుగానో నిర్వహిస్తున్న ప్రసిద్ధ Gismat Mandi రెస్టారెంట్ చైన్‌ను ఇటీవల పూర్తిగా రీబ్రాండ్ చేశారు. తన కుమారుడు జగద్వజ (Jagadvaj) పట్ల ఉన్న ప్రేమను గుర్తుగా, అతని పేరు తొలి అక్షరం ‘J’ను తీసుకుని రెస్టారెంట్ పేరును ‘Jismat Mandi’గా మార్చారు.రెస్టారెంట్ వ్యాపారం మొత్తం యాజమాన్యాన్ని కూడా తన కుమారుడికి అంకితం చేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు.
అమీర్‌పేట్ తర్వాత — చైతన్యపురిలో కొత్త బ్రాంచ్
కొద్ది రోజుల క్రితం అమీర్‌పేట్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన మహేష్, ఇప్పుడు చైతన్యపురిలో మరో శుభారంభం చేశారు. రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్బంగా సందడి పెంచేందుకు ప్రత్యేక ఆఫర్ కూడా ప్రకటించారు.
పేరు J తో మొదలైతే — ‘మినీ చికెన్ మండీ’ ఉచితం!
తన కుమారుడు జగద్వజ పేరుని బట్టి ఎవరి పేరు ‘J’ అక్షరంతో ప్రారంభమైతే వారికి మినీ చికెన్ మండీ పూర్తి ఫ్రీగా ఇస్తామని మహేష్ ప్రకటించారు. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే. వ్యక్తిగత గుర్తింపు ప్రూఫ్ చూపించాలి. ఒక్క వ్యక్తికి ఒక మండీ మాత్రమే అని ప్రకటించాడు. ఈ ప్రత్యేక ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది యువకులు తమ ‘J’ స్టార్ట్ అయ్యే పేర్లతో రెస్టారెంట్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ స్పందిస్తూ…
రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడిన ధర్మ మహేష్ .. నా కుమారుడు జగద్వజపై ఉన్న ప్రేమతోనే గిస్మత్‌ను జిస్మత్‌గా మార్చాను. ఈ సంస్థ మొత్తం భవిష్యత్తులో జగద్వజదే. అతని పేరుతో ప్రజలు మా బ్రాండ్‌ను గుర్తుంచుకోవాలన్నదే నా కోరిక” అని తెలిపారు.
ఫుడ్ బిజినెస్‌లోకి దూసుకెళ్తున్న సినీ స్టార్లు
ఇటీవలి కాలంలో ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న సినీ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు ధర్మ మహేష్ కూడా చేరాడు. ప్రత్యేకంగా మండీ ఐటమ్‌లతో మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన బ్రాండ్ ఇప్పుడు కొత్త పేరుతో, కొత్త ఆఫర్‌తో మరింత హైలైట్ అవుతోంది. ‘J’ అక్షరం ఉన్నవారు అయితే ఈ ఆఫర్ మిస్ కాకుండా రెస్టారెంట్‌కి వెళ్లాలని సోషల్ మీడియాలో చాలామంది ఇప్పటికే షేర్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram