దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా రవి నేలకూడిటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీశ్రీ’ మూవీ నుంచి విడుదలైన తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీకి కపిల్ కపిలన్ గాత్రం, అనంత శ్రీరామ్ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుల్కర్-పూజా కెమిస్ట్రీ, విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. దుల్కర్, పూజాకెమిస్ట్రీకి తోడు… రామ్ మాస్టర్ అందించిన కోరియోగ్రఫీ విజువల్‌గా పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ మెలోడీ వినసొంపుగా ఉండటంతో విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ తో దూసుకపోతుంది. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది.
ఈ సినిమాను ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తున్నారు. ఇటివల రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ తో స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘శ్రీశ్రీ’ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయళ భాషాల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.
Put on your headphones and relive your most beautiful memories 🎼❤️#SriSri first single #BommaBomma out now!
▶️ https://t.co/nPTPOeCXK7#LoveWillSparkAgain
Starring @dulQuer, @hegdepooja & @Dheekshiths
Directed by @ravinelakuditi9
Music by @gvprakash
Cinematography by… pic.twitter.com/amcwoIzouF— SLV Cinemas (@SLVCinemasOffl) July 27, 2026