Shriya Saran | లీకైన శ్రియా శరణ్ ఫోన్ నెంబర్.. ఈ ఇడియట్ ఎవరంటూ పోస్ట్
Shriya Saran తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటి శ్రియ శరణ్. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతోనూ నటించి స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది.
Shriya Saran తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటి శ్రియ శరణ్. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతోనూ నటించి స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ రోల్స్ తగ్గిపోవడంతో, శ్రియ మెల్లగా మదర్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రియ శరణ్ మొదటిసారి స్క్రీన్‌పై మదర్ షేడ్స్ ఉన్న పాత్రల పోషించింది ‘గోపాల గోపాల’ సినిమాతోనే. వెంకటేష్ భార్యగా, ఇద్దరి పిల్లల తల్లిగా కనిపించిన శ్రియ, ఆ తర్వాత ‘దృశ్యం’ లోనూ అలానే ఫ్యామిలీ వుమన్ పాత్రను పోషించింది.
రాజమౌళి *‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ దేవగన్ భార్యగా, చిన్న వయసు రామ్ చరణ్‌కి తల్లిగా కనిపించింది. అయితే ఈ పాత్రలన్నింటిలోనూ శ్రియ హీరోల తల్లి కాదు, కథలో పిల్లలకు తల్లిగా మాత్రమే కనిపించింది. వయసు 40 దాటిన నేపథ్యంలో యువ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయని, ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రియ యంగ్ హీరోలకు మదర్ క్యారెక్టర్లకు కూడా ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రియకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో శ్రియ డీపీతో పాటు ఫోన్ నెంబర్ కనిపిస్తుండగా, అది శ్రియదే అంటూ వైరల్ చేశారు. ఈ క్రమంలో శ్రియ స్పందిస్తూ.. ఈ ఇడియర్ ఎవరసలు.. ప్రజల సమయం వేస్ట్ చేస్తున్నాడు. నిజంగా ఇలా సమయం వృధా చేయడం బాధ అనిపిస్తుంది. అది నేను కాదు, ఆ నెంబర్ కూడా నాది కాదు. నన్ను ఇష్టపడే వ్యక్తులని తన ఫాలోవర్స్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ స్టుపిడ్ పర్సన్. ఒకరిని అనుకరించకుండా సొంతగా జీవించడం నేర్చుకోండి అంటూ శ్రియ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే శ్రియ పోస్ట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. వాడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండని సలహా ఇస్తున్నారు.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram