Anchor | యాంకర్‌గా మార‌డానికి ముందు ఎన్నో కష్టాలు… గోల్డ్ షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేసిన యాంక‌ర‌మ్మ‌

Anchor | టెలివిజన్, సోషల్ మీడియా ప్రపంచంలో మెరిసే చాలా మంది సెలబ్రిటీల వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు దాగి ఉంటాయి. కెమెరా ముందుకు రాకముందు వారు సాధారణ జీవితంలో ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కుటుంబ బాధ్యతలు నిర్వహించిన సందర్భాలు చాలానే ఉంటాయి.

  • By: sn |    movies |    Published on : Feb 17, 2026 8:10 AM IST
Anchor | యాంకర్‌గా మార‌డానికి ముందు ఎన్నో కష్టాలు… గోల్డ్ షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేసిన యాంక‌ర‌మ్మ‌

Anchor | టెలివిజన్, సోషల్ మీడియా ప్రపంచంలో మెరిసే చాలా మంది సెలబ్రిటీల వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు దాగి ఉంటాయి. కెమెరా ముందుకు రాకముందు వారు సాధారణ జీవితంలో ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కుటుంబ బాధ్యతలు నిర్వహించిన సందర్భాలు చాలానే ఉంటాయి. తాజాగా ఓ ప్రముఖ యాంకర్ తన కెరీర్ ప్రారంభానికి ముందు ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన పనుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి చొకారపు ప్రస్తుతం యాంకర్‌గా సినిమా ఈవెంట్లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటోషూట్లతో తరచూ ట్రెండ్ అవుతూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఈ గ్లామర్ లైఫ్ వెనుక ఉన్న తన నిజ జీవిత కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

స్రవంతి మాట్లాడుతూ… “నేను ఆరో తరగతి చదువుతున్నప్పటినుంచే మెహందీ వేయడం ప్రారంభించాను. ఓ బ్యూటీ పార్లర్‌తో టైఅప్ అయి మెహందీ పని చేసి డబ్బులు సంపాదించేదాన్ని. చిన్నప్పటి నుంచే స్వయంగా సంపాదించుకోవాలనే తపన ఉండేది. అసలు నేను యాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశాను. కానీ అప్పట్లో నా లవర్‌తో పెళ్లి విషయం వచ్చినప్పుడు వాళ్ల ఇంట్లో సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో ఆ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది” అని తెలిపారు.

పెళ్లి అనంతరం ఆర్థిక ఇబ్బందులు రావడంతో తిరిగి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. “హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న ఓ గోల్డ్ షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేశాను. అయితే ఆ పని చాలా సేపు నిలబడాల్సి ఉండడంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో ఆ జాబ్ మానేయాల్సి వచ్చింది” అని వెల్లడించారు.ఆ తర్వాత భర్త స్నేహితుడు అభిరామ్ ద్వారా ఓ టెలివిజన్ ఛానల్‌లో యాంకర్‌గా అవకాశం దొరికిందని, అదే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యిందని స్రవంతి చెప్పారు. “అక్కడి నుంచి యాంకర్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు నేను ఉన్న స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

స్రవంతి చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచంలో కనిపించే మెరుపుల వెనుక ఉన్న నిజమైన శ్రమ, పట్టుదలే విజయం సాధించడానికి కారణమని ఆమె జీవితం మరోసారి నిరూపించింది.