Suma Remuneration | యాంకర్ సుమ రెమ్యూనరేషన్‌పై చర్చ.. నెలకు కోటి వరకు సంపాదిస్తున్నారా?

Suma Remuneration | తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొన్ని దశాబ్దాలుగా సత్తా చాటుతున్న సుమ కనకాల మరోసారి వార్తల్లో నిలిచారు. తన చురుకైన మాటతీరు, హాస్య చతురత, స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ప్రేక్షకులను అలరించే సుమ.. టీవీ షోలు నుంచి సినిమా ఈవెంట్ల వరకు తెగ సంద‌డి చేస్తుంటుంది.

Suma Remuneration | తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొన్ని దశాబ్దాలుగా సత్తా చాటుతున్న సుమ కనకాల మరోసారి వార్తల్లో నిలిచారు. తన చురుకైన మాటతీరు, హాస్య చతురత, స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ప్రేక్షకులను అలరించే సుమ.. టీవీ షోలు నుంచి సినిమా ఈవెంట్ల వరకు తెగ సంద‌డి చేస్తుంటుంది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు, సక్సెస్ మీట్లు, అవార్డు ఫంక్షన్‌లు, టెలివిజన్ షోలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇలా ఏ కార్యక్రమమైనా సుమ హోస్టింగ్ చేస్తేనే పూర్తి అయినట్టుగా భావించే పరిస్థితి ఏర్పడింది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ జరిగే ఈవెంట్లలో సుమకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

సుమ రెమ్యున‌రేష‌న్ వార్త‌లు..

ఈ నేపథ్యంలో సుమ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఒక సినిమా ఈవెంట్‌కు సుమ రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. అలాగే సినిమా ప్రమోషన్‌లలో భాగంగా హీరో, హీరోయిన్‌లతో చేసే ఒక్కో ఇంటర్వ్యూకు రూ.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక టెలివిజన్ కార్యక్రమాల విషయానికి వస్తే, సుమ హోస్ట్ చేస్తున్న షోల ద్వారా కూడా ఆమెకు భారీ ఆదాయం వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె హోస్ట్ చేస్తున్న షోలలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

ఈవెంట్‌కి రూ. 70 ల‌క్ష‌లు..

ప్రైవేట్ ఈవెంట్లు, కార్పొరేట్ ఫంక్షన్‌లు, అవార్డు వేడుకలు వంటి ప్రత్యేక కార్యక్రమాలకు అయితే సుమ రెమ్యూనరేషన్ మరింత ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఈవెంట్‌కు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు తీసుకుంటోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కాకుండా సోషల్ మీడియా, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు, డిజిటల్ కోలాబరేషన్ల ద్వారా కూడా సుమకు గణనీయమైన ఆదాయం వస్తోందని సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఆమె నెలకు రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సంపాదిస్తున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ రెమ్యూనరేషన్ వివరాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. అయినప్పటికీ, సుమ క్రేజ్, ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ అంచనాలు ఆశ్చర్యం కలిగించవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ, ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతూ యాంకర్‌గా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.

Latest News