Bayilone Ballipalike | మంగ్లీ ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ సెన్సేషన్… 3 కోట్ల వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది!

Bayilone Ballipalike | తెలుగు శ్రోతలు సినిమా పాటలకు మాత్రమే కాకుండా జానపదాలపై ఎంత ఆస‌క్తి చూపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా మంగ్లీ పాట‌ల‌కి ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. పండగ, గ్రామీణ ఉత్సవం, ప్రత్యేక వేడుక..ఏ సందర్భమైనా ఆమె పాటలు ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపేస్తుంటాయి.

  • By: sn |    movies |    Published on : Dec 11, 2025 10:35 AM IST
Bayilone Ballipalike | మంగ్లీ ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ సెన్సేషన్… 3 కోట్ల వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది!

Bayilone Ballipalike | తెలుగు శ్రోతలు సినిమా పాటలకు మాత్రమే కాకుండా జానపదాలపై ఎంత ఆస‌క్తి చూపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా మంగ్లీ పాట‌ల‌కి ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. పండగ, గ్రామీణ ఉత్సవం, ప్రత్యేక వేడుక..ఏ సందర్భమైనా ఆమె పాటలు ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపేస్తుంటాయి. దీంతో మంగ్లీ విడుదల చేసిన ప్రతి ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోవడం సహజమే.ఇప్పటికే ఆమె పాడిన అనేక పాటలు కోట్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉండగా… తాజాగా విడుదలైన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ భారీ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ, యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది.

ట్రెండింగ్‌లో తుఫానులా ‘బాయిలోనే బల్లి పలికే’

ఎక్కడ విన్నా… ఏ ఈవెంట్‌ చూసినా… అందరి నోట ఒకటే పాట బాయిలోనే బల్లి పలికే సాంగ్‌. మంగ్లీ వాయిస్ ఎనర్జీ, బీట్‌కు తగ్గ స్టెప్పులు, మధ్య మధ్యలో నాగవ్వ వాయిస్ ఇచ్చిన ఫోక్ వైబ్ ఈ పాటను మరింత హైలైట్ చేస్తున్నాయి. పాట లిరిక్స్ గుర్తు లేకపోయినా ట్యూన్‌కు హమ్ చేస్తూ సోషల్ మీడియాలో అందరూ దుమ్ము రేపుతున్నారు.

రీల్స్‌లో రచ్చ

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాట హ‌వా మాములుగా లేదు. పూర్తి పాట విడుదలకుముందే టీజర్ మ్యూజిక్‌తో రీల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఫుల్ సాంగ్ రావడంతో రీల్స్ సంఖ్య ఆకాశాన్నంటుతోంది. సగటు పది రీల్స్‌లో ఏడు రీల్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇ అంటే సాంగ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

3 కోట్ల వ్యూస్ దిశగా దూసుకెళ్తున్న హిట్ సాంగ్

మూడు రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ దాటేసిన ఈ ఫోక్ పాట… ఇప్పుడు 3 కోట్ల వ్యూస్ మార్క్‌కు అతి దగ్గరగా చేరుకుంది. ప్రస్తుతం ఈ పాట 2.95 కోట్ల వ్యూస్ వద్ద ఉంది. ఇంకా 10 రోజులు పూర్తికాకముందే 3 కోట్ల మైలురాయిని దాటడం ఖాయమని అనిపిస్తోంది. 2025 లో రిలీజ్ అయిన సాంగ్స్ లో బ్లాస్టింగ్ సాంగ్ గా బాయిలోనే బల్లిపలికే నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాలి.

ఈ పాట‌కి లిరిక్స్ కమల్ ఎస్లావత్ అందించ‌గా, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, సింగర్స్: మంగ్లీ & నాగవ్వ. బీట్‌తో పాటు బేస్‌, మంగ్లీ ఎనర్జిటిక్ వాయిస్‌, నాగవ్వ జానపద టచ్ ఇవన్నీ కలిపి పాటను నాన్‌స్టాప్ పార్టీ సాంగ్‌గా మార్చేశాయి.

న్యూ ఇయర్ – సంక్రాంతి సీజన్‌లో మంగ్లీ రాజ్యం

2025లో విడుదలైన ఫోక్ సాంగ్స్‌లో ఇప్పటికి బ్లాస్టింగ్ హిట్‌గా నిలిచిన బాయిలోనే బల్లి పలికే… న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల్లో ప్రతీ పార్టీ, ప్రతీ ఇంట్లో మారుమోగడం ఖాయం. వ్యూస్ పరంగా కూడా ఇది భారీ రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.