Deepika Pilli | ‘జబర్దస్త్’ షో లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం టెలివిజన్, సినిమాల్లో బిజీగా కొనసాగుతున్నాడు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించిన సుధీర్, మధ్యలో కొంతకాలం బుల్లితెరకు దూరమైనా… ఇప్పుడు మళ్లీ గేమ్ షోలు, ఈవెంట్లతో ఫుల్ బిజీ అయ్యాడు.
ఇక సుధీర్ – రష్మీ గౌతమ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అభిమానులు నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కానీ అది కేవలం షో కోసం మాత్రమేనని, తమ మధ్య మంచి స్నేహమే తప్ప మరేమీ లేదని ఇద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ రూమర్స్ మాత్రం ఆగలేదు.
దీపికా పిల్లితో ప్రేమలో..
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సుధీర్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఆయన పేరు యంగ్ యాంకర్, హీరోయిన్ దీపికా పిల్లితో కలిపి వినిపిస్తోంది. ‘ఢీ’ వంటి డ్యాన్స్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీపికా, ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
రీసెంట్‌గా దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుధీర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి, “మన కొత్త ప్రయాణం లాక్ అయింది” అన్నట్టుగా క్యాప్షన్ పెట్టి వెంటనే డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్టోరీ బయటకు రావడంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో సుధీర్ – దీపికా రిలేషన్‌పై ప్రచారం జరుగుతుండగా… ఈ తాజా స్టోరీ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టైంది. అయితే ఈ వార్తలపై దీపికా తన ఇన్‌స్టా ద్వారా క్లారిటీ ఇచ్చింది. నా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయింది. ఆ ఫొటో ఏఐ ద్వారా సృష్టించింది. నా ఇన్‌స్టా స్టోరీలో కనిపించిన ఫొటో నిజం కాదు. నా అనుమతి లేకుండా ఎవరో ఆ ఫొటో పోస్ట్ చేశారు. గత 24గంటల సమయంలో ఏవైతే నా ఇన్‌స్టాలో కనిపించాయో అవన్నీ నిజం కాదంటూ దీపికా పిల్లి పేర్కొంది. దీంతో వారిద్దరికి సంబంధించిన పుకార్లకి పులిస్టాప్ పడింది.
