విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
విజయ్ సేతుపతి (Vijay Sethupathi), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సంయుక్త (Samyuktha) కథానాయికగా నటిస్తోండగా టబు (Tabu) కీలక పాత్ర పోషిస్తున్నది
విధాత: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సంయుక్త (Samyuktha) కథానాయికగా నటిస్తోండగా టబు (Tabu) కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ, విజయ్ సేతుపతి జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టైటిల్‌గా (SLUMDOG – 33 Temple Road) ఫిక్స్ చేయగా స్లమ్ నుంచి పుట్టిన మెరుపును ఏ ఒక్కరు ఆపలేరు, రా అండ్ రియల్ రూత్‌లెస్ అంటూ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. కాగా ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram