Indraja | ఇంద్ర‌జ జ‌బ‌ర్ధ‌స్త్‌ జ‌డ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన న‌టి

Indraja | ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్‌ ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, అలాగే పలు టీవీ షోల ద్వారా తిరిగి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. సినిమాలతో పాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్‌ షోలతో కూడా ఆమె బిజీగా మారింది.

  • By: sn |    movies |    Published on : Dec 08, 2025 10:18 AM IST
Indraja | ఇంద్ర‌జ జ‌బ‌ర్ధ‌స్త్‌ జ‌డ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన న‌టి

Indraja | ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్‌ ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, అలాగే పలు టీవీ షోల ద్వారా తిరిగి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. సినిమాలతో పాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్‌ షోలతో కూడా ఆమె బిజీగా మారింది. తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ, జబర్దస్త్ జడ్జిగా తన ఎంట్రీ ఎలా జరిగిందో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంద్రజ మాట్లాడుతూ.. “కరోనా తర్వాత నాకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. ఒకసారి రోజా గారికి హెల్త్ సమస్య రావడంతో, ఒక్క ఎపిసోడ్‌కు గెస్ట్ జడ్జిగా రావాలని జబర్దస్త్ టీమ్ కాల్ చేశారు. నేను సమ్మతించి వెళ్లాను” అని చెప్పింది. ఒక ఎపిసోడ్‌లో ఆమె తీర్పు, వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి టీమ్ పూర్తిగా ఇంప్రెస్ అయ్యిందట. దీంతో అదే రోజు రెండవ ఎపిసోడ్ కూడా కొనసాగించమని కోరారట.

ఒక్క రోజులోనే వచ్చిన జడ్జి ఆఫర్

ఇంద్రజ ఇంటికి వెళ్లిన వెంటనే షో టీమ్ నుంచి మరో కాల్ వచ్చింద‌ని, రోజా గారు తిరిగి వచ్చేవరకు మీరు కంటిన్యూ అవ్వాలి అని చెప్పారట. ఇక నేను చేసిన మొదటి ఎపిసోడ్‌ ప్రోమోకు దాదాపు 3000 కామెంట్స్ రాగా, అందులో 2800 కామెంట్స్ నా గురించి పాజిటివ్‌గా వచ్చాయి. పబ్లిక్ అలా స్పందించడంతోనే నన్ను జడ్జిగా ఫిక్స్ చేశారు” అని వెల్లడించింది.

యంగ్ జనరేషన్‌కు ఇంద్రజ రీ-కనెక్ట్

ఒక్క ఎపిసోడ్ కోసం వచ్చిన ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్‌కు రెగ్యులర్ జడ్జ్‌గా మారింది. దీనితో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. టీవీ షోల ద్వారా ఆమె మళ్ళీ యువతతో కూడా మంచి కనెక్షన్ ఏర్పరుచుకుంది.తన అనుభవం, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్, సెన్సిబుల్ జడ్జ్‌మెంట్ వల్లే ఇంద్రజ టీవీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారని స్పష్టం అవుతోంది. మ‌రోవైపు అడ‌పాద‌డ‌పా ప‌లు సినిమాల‌లో స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇంద్ర‌జ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంద‌నే చెప్పాలి.