Kajol | మూడు దశాబ్దాల తర్వాత ‘నో కిస్సింగ్’ నియమాన్ని ఉల్లంఘించిన‌ కాజోల్… కారణం ఇదే!

Kajol | బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. “దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే”, “కభీ ఖుషీ కభీ గమ్”, “కుచ్ కుచ్ హోతా హై” వంటి సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే ఈ కాలమంతా తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించకూడదనే నియమాన్ని ఆమె కఠినంగా పాటిస్తూ వచ్చారు.

అయితే ఇటీవల ఆమె తన నిర్ణయాన్ని మార్చడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వేదికలోకి అడుగుపెట్టిన కాజోల్, ఆ ప్రాజెక్ట్‌లో తొలిసారి ముద్దు సన్నివేశంలో నటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.

ఈ విషయంపై మాట్లాడిన కాజోల్, ఆ సన్నివేశం కేవలం ఒక ముద్దు కాదని, పాత్ర భావోద్వేగాలు, ఆలోచనలు, నమ్మకాలతో ముడిపడి ఉందని తెలిపారు. “ఆ సన్నివేశం లేకపోతే పాత్రలోని ముఖ్యమైన భావం పోతుంది” అని ఆమె వివరించారు.

అసౌక‌ర్యంగా ఫీలైన కూడా..

అయితే ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో తాను కొంత అసౌకర్యంగా ఫీలయ్యానని కూడా కాజోల్ అంగీకరించారు. చివరి వరకు తాను పూర్తిగా సౌకర్యంగా లేనప్పటికీ, అది వృత్తిపరమైన నిర్ణయంగా తీసుకుని పూర్తి చేశానని చెప్పారు.

ఈ నిర్ణయం తన వ్యక్తిగత అభిప్రాయాల్లో మార్పు వల్ల కాదని, కేవలం పాత్ర అవసరం కోసం తీసుకున్న ప్రొఫెషనల్ నిర్ణయం మాత్రమేనని కాజోల్ స్పష్టం చేశారు. తన కెరీర్‌లో ఎప్పుడూ తన నిర్ణయాల విషయంలో నిజాయితీగా ఉంటానని కూడా ఆమె పేర్కొన్నారు.

మొత్తంగా, మూడు దశాబ్దాల పాటు తన నియమాలను కట్టుబడి పాటించిన కాజోల్, కథకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె వృత్తిపరమైన నిబద్ధతను మరోసారి రుజువు చేసింది.

Latest News